నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్‌పల్లి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నల్లగొండలోని విద్యాగ్రామర్ స్కూలుకు చెందిన బస్సు వివిధ గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకుని వెళుతోంది. ఈ క్రమంలో తానేదార్‌పల్లి గ్రామ సమీపంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న 20 మంది బాలబాలికలకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. షాక్‌కు గురైన పిల్లలందరినీ వెంటనే వేరే వాహనాల్లో పాఠశాలకు తీసుకెళ్లారు.