మోతుగూడెం: రామచంద్రపురం నుంచి చింతూరు మండలం పొల్లూరు మీదుగా ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 338 సముద్ర తాబేళ్లను లక్కవరం ఎఫ్‌ఆర్‌ఓ జి.ఉషారాణి స్వాధీనం చేసుకున్నారు.
ఆమె విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరం అటవీ రేంజ్‌లోని 1977 టేకు ప్లాంటేషన్ వద్ద అటవీ బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఇద్దరు వ్యక్తులు జీపులో తాబేళ్లను తరలిస్తూ కంటపడ్డారు. ఆ వాహనాన్ని వెంబడించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా, ఏడు మూటల్లో కట్టిఉన్న తాబేళ్లు లభించాయి. వారిని విచారణ చేయగా.. రామచంద్రపురం నుంచి పొల్లూరు మీదుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్టు తెలిపారు. తాబేళ్లను స్వాధీనం చేసుకుని, పొల్లూరు గ్రామానికి చెందిన మడ్డు గంగునాయుడు, కొల్లు సత్యనారాయణను అరెస్టు చేశారు. దాడిలో డీఆర్‌ఓ ఎం.జాన్సన్ పాల్గొన్నారు.
సముద్ర తాబేళ్లు స్వాధీనం
Published Wed, May 25 2016 9:26 AM | Last Updated on Wed, Sep 26 2018 6:01 PM
Advertisement