భద్రతా ప్రమాణాలను పెంచండి
-
ఎస్పీ విశాల్‌గున్నీ
నెల్లూరు(క్రైమ్):
జిల్లా కేంద్రకారాగారంలో భద్రతా ప్రమాణాలను పెంచాలని ఎస్పీ విశాల్‌గున్నీ జైలు అధికారులకు సూచించారు. చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఎస్పీ విశాల్‌గున్నీ జైలు అధికారులతో శుక్రవారం జిల్లాస్థాయి సెక్యూరిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్పీ కారాగారంలో భద్రతా ఏర్పాట్లను, కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను పరిశీలించి పలు సూచనలు, సలహాలిచ్చారు. ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి వారికందుతోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ ఎయిర్ (ఆరుబయలుక్షేత్రం)ను పరిశీలించి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కారాగారం ప్రధాన ద్వారం వద్ద భద్రతను మరింత పెంచాలన్నారు. మెటల్ డిటెక్టర్లను, హ్యాండ్ డిటెక్టర్లను ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే కారాగారంలోకి అనుమతించాలన్నారు. గార్డెనింగ్ స్టాఫ్ సంఖ్యను పెంచడంతో పాటు సెల్‌ఫోను జామర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపన్‌ఎయిర్ జైలులో జనరేటర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్రకారాగార సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్, డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అంజయ్య, జైలర్లు కాంతరాజు, శివప్రసాద్, జైలు అధికారులు పాల్గొన్నారు.