ఎంపికైన క్రీడాకారులతో సపక్‌తక్ర సంఘ అధ్యక్షుడుఎమ్మెస్సార్, తదితరులు
జిల్లా సపక్‌తక్ర క్రీడా జట్లు ఖరారు
Published Tue, Aug 16 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
18, 19 తేదీల్లో కడపలో రాష్ట్రస్థాయి పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్ (అండర్–19) బాలబాలికల సపక్‌తక్ర జట్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సపక్‌తక్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కోడిరామ్మూర్తి స్టేడియంలో సపక్‌తక్ర ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలను ఆ సంఘ అధ్యక్షుడు ఎమ్మెస్సాఆర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కిందట జిల్లాలో సపక్‌తక్ర క్రీడను పరిచయం చేశామన్నారు. అనతి కాలంలోనే క్రీడాకారులు ఉన్నతంగా రాణిస్తుండటం శుభపరిణామంగా పేర్కొన్నారు.
18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు..
వైఎస్సార్ కడప జిల్లాలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి జూనియర్ సపక్‌తక్ర చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయని సంఘ ప్రధాన కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి వెల్లడించారు. ఇక్కడ ఎంపికచేసిన జట్లు రాష్ట్ర పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, ఎండీ కాసీంఖాన్, సపక్‌తక్ర సంఘ ఉపాధ్యక్షుడు పి.నర్సింగరావు, రామారావు, ప్రతినిధులు రమేష్‌నాయుడు, సత్యనారాయణ, ఈశ్వరరావు పాల్గొన్నారు.
తుది జట్లు ఖరారు
ఎంపికల అనంతరం క్రీడాకారుల ప్రతిభ, శిక్షణ శిబిరాల్లో ప్రాతినిధ్యం, నైపుణ్యం ఆధారంగా తుది జట్లను ఖరారు చేశారు. చెరో ఐదేసి మంది సభ్యులతో కూడిన జట్లు జాబితాను సంఘ ప్రతినిధులు ప్రకటించారు.
బాలురు జట్టు: ఎస్.తారకేశ్వరరావు (కెప్టెన్), డి.సంతోష్, ఎస్.కృష్ణప్రసాద్, డి.చంద్రశేఖర్, డి.తేజ. జట్టుకు కోచ్, మేనేజర్లుగా జి.షున్ముఖ, బి.ఈశ్వరరావులు వ్యవహరిస్తారు.
బాలికల జట్టు: ఎస్.పద్మజ (కెప్టెన్), జి.దుర్గాప్రశాంతి, ఎస్.హేమలత, బి.ఝాన్సీ, బి.అనూష. ఈ జట్టుకు ఎ.హరిత, జి.అర్జున్‌ప్రసాద్‌లు కోచ్, మేనేజర్లుగా వ్యవహరించనున్నారు.
Advertisement
Advertisement