
బెజవాడలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు
విజయవాడ: బెజవాడ కేంద్రంగా సాగుతున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. నగరంలోని ఓ సీఐ ఫ్లాట్ పక్కనే జరుగుతున్న ఈ దందాను మంగళవారం రాత్రి పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.
పోలీసుల దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లు, ఇద్దరు విటులు, ఒక నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుల వద్ద పలువురు ప్రముఖుల సెల్ నంబర్లు దొరికినట్లు తెలుస్తుంది. వాటిలో నగరానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్ల నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. నగరంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.