
స్టేట్‌బ్యాంక్ మేనేజర్‌పై లైంగిక వేధింపుల కేసు
లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొగల్తూరు : లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మొగల్తూరు శాఖ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ డి.జె.రత్నం మంగళవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మొగల్తూరుకు చెందిన ఓ మహిళ స్టేట్ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేశారు.
రూ.లక్ష మంజూరు చేసిన మొగల్తూరు బ్రాంచ్ మేనేజర్ కె.వి.ఎస్.ప్రసాద్ ఆమె పేరున రూ.50వేలు డిపాజిట్ చేసి రూ.17వేలు మామూలు తీసుకుని రూ.33వేలు చేతికి ఇచ్చారు. ఆ తర్వాత ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.