ఎస్‌జీఎఫ్ అండర్–19 క్రీడాకారుల ఎంపిక
ఎస్‌జీఎఫ్ అండర్–19 క్రీడాకారుల ఎంపిక
Published Fri, Sep 16 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
– రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్, బాల్‌బ్యాడ్మింటన్ జట్ల ఖరారు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్థాయి బాలబాలికలకు స్కూల్‌గేమ్స్ అండర్–19 ఎంపికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో బాల్‌బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించగా, పెద్దపాడులోని శ్రీరామ వ్యాయామ కళాశాలలో వెయిట్‌లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్–19 జట్లకు ఎంపికచేస్తామని ఫెడరేషన్ కార్యనిర్వహన కార్యదర్శి పీవీఎల్‌ఎన్ కృష్ణ వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు పయనం
కాగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రాష్ట్ర స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. క్రీడాకారుల వెంట పీఈటీ అఖిల్ మేనేజర్‌గా వెళ్లారు. ఈ పోటీలు పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం వేదికగా జరగనున్నాయి. ఇదిలావుండగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కేంద్రంగా ఈ నెల 20 నుంచి రాష్ట్ర స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయని కార్యదర్శి కృష్ణ తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు వీరే
వెయిట్‌లిఫ్టింగ్‌లో: ఆదిలక్ష్మి(ప్రియాగ్రహారం), పార్వతీశంరెడ్డి(టెక్కలి), రామకృష్ణ(కోటబొమ్మాళి), వాసునాయుడు(టెక్కలి) ఎంపికైనవారిలో ఉన్నారు.
బాల్‌బ్యాడ్మింటన్ జట్టు: ప్రవీణ్‌కుమార్, రవికుమార్, హరి, కిరణ్‌కుమార్, హరీష్, తారకేశ్వరరావు, డి.హరి, తేజేశ్వరరావు ఎంపికయ్యారు. వీరంతా ఏపీ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల టెక్కలికి చెందిన విద్యార్థులు కావడం విశేషం.
Advertisement