తుమ్మల కోసం కేబినెట్‌ మొత్తం ప్రచారమా! | Shabbir ali slams tummala nageswara rao | Sakshi
Sakshi News home page

తుమ్మల కోసం కేబినెట్‌ మొత్తం ప్రచారమా!

Published Sun, May 15 2016 7:59 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

Shabbir ali slams tummala nageswara rao

నిజామాబాద్‌: పాలేరు ఉప ఎన్నికలో తెలంగాణ ద్రోహి టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు కోసం కేబినెట్‌ మొత్తం ప్రచారం చేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో రైతులు ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం పథకానికి కాంట్రాక్టులు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పినదానికంటే తక్కువ వాటర్‌ స్టోరేజీతో ప్రాజెక్టుల రీడిజైన్‌ జరుగుతోందని షబ్బీర్‌ అలీ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement