కొనసాగుతున్న షూటింగ్
ఎమ్మిగనూరురూరల్: జబర్దస్త్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ బనవాసి ఫారం పరిసర ప్రాంతాల్లో ఐదో రోజు శుక్రవారం కొనసాగింది. బనవాసి ఫారం, కోటేకల్ హైవే, ఆడవుల్లో ప్రాంతాల్లో బాలిక హాసినిని కిడ్నాప్ చేసే సన్నివేశంతో పాటు, హిరోయిన్స్ పలు సీన్స్‌ను చిత్రీకరించారు. మరో రెండు రోజుల్లో సీనియర్ తారాగణం ఎమ్మినగూరుకు వస్తున్నార డైరెక్టర్ సుజాత భౌర్య తెలిపారు. సినిమా కథ అంతా బాలిక హాసిని చుట్టు తిరుగుతుంటుందని తెలిపారు. కెమెరామెన్ నందన్‌కృష్ణ, సంగీత దర్శకులు శ్రీకోటి, హిరో,హిరోయిన్స్, నటుడు అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. షూటింగ్‌ను చూసేందుకు చట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.