banavasi
-
FSBS: వీర్యోత్పత్తిలో ఘన కీర్తి బనవాసి
ఎమ్మిగనూరు రూరల్: నాణ్యమైన పశు వీర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది కర్నూలు జిల్లాలోని బనవాసి ఘనీకృత వీర్యోత్పత్తి కేంద్రం. మన రాష్ట్రంలో నంద్యాల, విశాఖపట్నం, బనవాసిలలో, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో ఘనీకృత పశు వీర్యోత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బనవాసి కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏటా లక్షల డోసుల నాణ్యమైన పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడంతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. దశాబ్దాలుగా మేలు జాతి పశు సంతతి అభివృద్ధికి ఈ కేంద్రం దోహదపడుతోంది. దీంతోపాటు గొర్రెలు–మేకల పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలో యంగ్ బుల్ (ఒంగోలు జాతి ఎద్దులు) పెంపక కేంద్రం ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఐఎస్వో గుర్తింపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి ఫారంలో 1986వ సంవత్సరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 8.98 ఎకరాల్లో ఈ కేంద్రం విస్తరించి ఉంది. మేలు జాతి ఆబోతుల నుంచి నాణ్యత గల వీర్యాన్ని ఉత్పత్తి చేయటం, తద్వారా అధిక పాల దిగుబడినిచ్చే పశు సంతతిని అభివృద్ధి చేయటం, కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా నాణ్యమైన దూడలను ఉత్పత్తి చేయటం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. బనవాసి ఆబోతు వీర్య కేంద్రానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ 2010 అక్టోబర్‌లో ఐఎస్వో సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అలాగే, 2020 మార్చిలో గ్రేడింగ్ చేయటానికి వచ్చిన కేంద్ర బృందం ఈ కేంద్రానికి ‘ఏ’ గ్రేడ్ ఇచ్చింది. మేలు జాతి పశు సేకరణ మొదలు పర్యవేక్షణ, వీర్య ఉత్పత్తి, వీర్యాన్ని భద్రపరచటం, సరఫరా చేయటం వంటి ప్రతి అంశం ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతుంది. ప్రత్యేక పర్యవేక్షణ బనవాసి వీర్యోత్పత్తి కేంద్రంలో ప్రధానంగా పశువుల వ్యాధి నిరోధకతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ పశువుల ఆరోగ్య పరిరక్షణను అనుభవజ్ఞులైన వైద్యాధికారులు, వీర్య సేకరణ పరీక్షలను నిపుణులైన శాస్త్రవేత్తలు చేపడుతున్నారు. ఆబోతులకు నాణ్యమైన దాణా సరఫరా చేయటం, క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయటం, గొంతు వాపు, గాలికుంటు వ్యాధి, తెలిరియస్, అంత్రాక్స్ వంటి వ్యాధులను నిర్ధారించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించటం చేస్తుంటారు. వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమునాలు, పేడ, మూత్రంను బెంగళూరులోని ఎస్ఆర్డీడీఎల్ ల్యాబ్‌కు పంపుతారు. అదే విధంగా రాష్ట్రంలోని వీబీఆర్ఐ–హైదరాబాద్, ఏడీడీఎల్–కర్నూల్ వారికి పంపి వ్యాధి నిర్ధారణ, పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. వీర్యోత్పత్తి – సరఫరా బనవాసి ఆబోతు వీర్య కేంద్రంలో నెలకు సరాసరి లక్షన్నర నుంచి రెండు లక్షల డోసుల వరకు నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. 2018–2019లో 21,59,442 వీర్యాన్ని ఉత్పత్తి చేయగా 20,44,098 డోసులను పంపిణీ చేశారు. 2019–2020లో 17,61,951 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తే, 13,61,985 డోసులను పంపిణీ చేశారు. 2020–2021 (నవంబర్ వరకు)లో 14,48,713 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేయగా, 13,28,803 లక్షల డోసులను పంపిణీ చేశారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి చేసిన వీర్యాన్ని గతంలో మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. కరోనా నేపథ్యంలో ఏడాది నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు మాత్రమే వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు. 87 రకాల పశువులు మేలి రకం జాతి సంతతి పశువులను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రంలో కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జాతులకు చెందిన 87 రకాల పశువులు ఉన్నాయి. ఇందులో ముర్రా జాతి సంతతికి చెందిన 39 రకాలు, జెర్సీ జాతి రకాలు 12, హోల్స్టీమ్ ఫ్రీషిమన్ జాతి (హెచ్ఎఫ్) 9, క్రాస్ బీడ్ జెర్సీ జాతి (సీబీజేవై) 14, సీబీహెచ్ఎఫ్ రకాలు 7, జీఐఆర్ రకం 2, సహివాల్ రకం 1, మేహసన 3 చొప్పున మొత్తం 87 రకాల పశువులు ఇక్కడ ఉన్నాయి. మేలి రకం పశుగ్రాసం సాగు బనవాసి కేంద్రంలో వినియోగించే పశుగ్రాసం సాగుకు 400 ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 210 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, జొన్నతోపాటు సూపర్ నేపియర్, పారాగడ్డి వంటి నాణ్యమైన పశుగ్రాసాలను పండిస్తున్నారు. మంచి డిమాండ్.. దేశంలో బనవాసి ఘనీకృత ఆబోతు వీర్య కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న వీర్యానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. మేలు జాతి పశువుల అభివృద్ధి, ఆబోతుల పరిరక్షణకు ప్రత్యేక పద్ధతులు పాటిస్తూ లక్ష్యాన్ని సాధిస్తున్నాం. – డిప్యూటీ డైరెక్టర్, బనవాసి ఆబోతు కేంద్రం -
బవనాసి.. ప్రాణం తీసి!
ఆత్మకూరురూరల్: సప్తనదీ సంగమంలో కలిసే నదుల్లో ఒకటైన పరమపావన బవనాసి నది ఇద్దరు బాలుర ప్రాణాలు బలి తీసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రంజాన్ మాసం, వేసవి సెలవులు నేపథ్యంలో బండిఆత్మకూరు మండలం ఏ కోడూరుకు చెందిన ముర్తుజావలి తన కుమారుడు యూనిస్(13)ను శ్రీపతిరావుపేటలో ఉండే తన మామ వన్నూర్‌సాబ్ ఇంటికి పంపాడు. గ్రామంలో వన్నూర్‌సాబ్ ఇంటికి ఎదురుగా ఉండే ముర్తుజా కుమారుడు నబీరసూల్(14)తో యూనిస్‌కు స్నేహం కుదిరింది. దీంతో ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. మంగళవారం ఉదయం నబీరసూల్ తాత దస్తగిరి పశువులకు మేత కోసం తన పొలం వైపు వెళుతుంటే స్నేహితులిద్దరూ వెళ్లారు. అక్కడ పొలంలో కాసేపు తాతతో కలిసి గడ్డి కోసిన వారు గడ్డి కోసం సమీపంలోని బవనాసి నది ఒడ్డుకు వెళ్లారు. ఎంతసేపటికీ రాకపోవడంతో దస్తగిరి చుట్టుపక్కల వారితో కలిసి పిల్లల కోసం వెతికారు. ఓ చోట వాగు గట్టున పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి వాగులో గాలించగా ఇద్దరి మృతదేహాలు బురదలో చిక్కుకుపోయినట్లు గుర్తించి బయటకు తీశారు. ఆత్మకూరు ఎస్ఐ రమేష్‌కుమార్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా నబీరసూలు సోదరి వివాహ శుభలేఖల పంపిణీలో నిమగ్నమైన ముర్తుజా కుటుంబసభ్యులకు సమాచారం తెలియడంతో బోరున విలపించారు. అలాగే సెలవులకని వెళ్లిన కుమారుడు ఇక లేడని తెలుసుకున్న యూనిస్ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
కొనసాగుతున్న షూటింగ్
ఎమ్మిగనూరురూరల్: జబర్దస్త్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ బనవాసి ఫారం పరిసర ప్రాంతాల్లో ఐదో రోజు శుక్రవారం కొనసాగింది. బనవాసి ఫారం, కోటేకల్ హైవే, ఆడవుల్లో ప్రాంతాల్లో బాలిక హాసినిని కిడ్నాప్ చేసే సన్నివేశంతో పాటు, హిరోయిన్స్ పలు సీన్స్‌ను చిత్రీకరించారు. మరో రెండు రోజుల్లో సీనియర్ తారాగణం ఎమ్మినగూరుకు వస్తున్నార డైరెక్టర్ సుజాత భౌర్య తెలిపారు. సినిమా కథ అంతా బాలిక హాసిని చుట్టు తిరుగుతుంటుందని తెలిపారు. కెమెరామెన్ నందన్‌కృష్ణ, సంగీత దర్శకులు శ్రీకోటి, హిరో,హిరోయిన్స్, నటుడు అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. షూటింగ్‌ను చూసేందుకు చట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
బనవాసిలో షూటింగ్ సందడి
ఎమ్మిగనూరు రూరల్: పట్టణం, బనవాసి ఫాం పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఐడియా క్రియేషన్ ప్రొడక్షన్- 2 పేరున ‘జబర్దస్త్ గబ్బర్‌సింగ్ ’ సినిమాను ఐదుగురు హీరోలతో నిర్మిస్తున్నారు. బనవాసి ఫాం ప్రాంతాల్లో కొన్ని సీన్లను తెరకెక్కించారు. సాయంత్రం పట్టణంలో లక్ష్మణ్ థియేటర్లో చిత్రం యూనిట్ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ సుజాత బౌర్య మాట్లాడుతూ ఇది తనకు రెండవ సినిమా అని తెలిపారు. మొదటి సినిమా పంచమితో గుర్తింపు వచ్చిందన్నారు. ఐదుగురు హీరోలతో వినోదం, హర్రర్ ఉంటుందని చెప్పారు. ఇందులో ఐదుగురు హీరోలు చిత్రం శ్రీను, హర్ష, నవీన్, బాలు, శాంతిమహరాజ్ నటిస్తున్నారని, హీరోయిన్లుగా బెంగళూరుకు చెందిన అదితిరాయ్తోపాటు మరో యాక్టర్ ఉంటుందన్నారు. ఇక్కడే 10 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని తెలిపారు. నిర్మాతలుగా చల్లా విజయ్‌కుమార్, అభిబాష, కెమెరామోన్గా నందనకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకోటి, కొరియోగ్రాఫర్ బాలకృష్ణ పనిచేస్తున్నారని చెప్పారు. -
తొమ్మిదిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వనం
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 2017–2018 విద్యా సంవత్సరానికి 9 వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు 29వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8 వ తగరతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 24 వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రూ.6.5 కోట్లతో ‘బనవాసి’ అభివృద్ధి
మంత్రాలయం, న్యూస్‌లైన్: ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఫారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.6.50 కోట్లు మంజూరు చేసినట్లు పశుగణాభివృద్ధి శాఖ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ పీడీ కొండారావు పేర్కొన్నారు. రాఘవేంద్రుల దర్శనార్థం బుధవార ం ఆయన మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనవాసిలో ఫారం అభివృద్ధి, కొత్త ఆబోతుల కొనుగోలు, ఘనీకృత వీర్యం నిల్వ పరికరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. కరీం నగర్, బనవాసి క్షేత్రాల్లో 66 నుంచి 120 జెర్సీ ఆబోతులు పెంచుతామని వివరించారు. లైవ్ స్టాకు కోసం రూ.9 కోట్లు, ఘనీకృత వీర్య కేంద్రాల అభివృద్ధికి జాతీయ డెయిరీ ప్రణాళిక నుంచి రూ.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 108 లక్షల పశువులు ఉండగా ఈ ఏడాది 93 లక్షలకు పడిపోయాన్నారు. కృత్రిమ గర్భదారణ ద్వారా 25 శాతం పశువులు వృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. సెమెన్ ధన రూ.30 నుంచి 40కి పెరిగిందన్నారు. ఆయనతోపాటు పశుగణాభివృద్ధి శాఖ జిల్లా సీఈవో హమీద్‌బాషా, డాక్టర్ శ్యాంప్రసాద్, వరప్రసాద్, ఆచారి పాల్గొన్నారు.