సంప్రదాయాలను కొనసాగిద్దాం
–రాష్ట్రస్థాయి బలప్రదర్శనలో ఎమ్మెల్యే
–కర్నూలు ఎడ్లకు ప్రథమ స్థానం
ఎమ్మిగనూరు: మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలని, అందులో భాగమే ఎడ్ల బండలాగుడు ప్రదర్శన అని ఎమ్మెల్యే డాక్టర్ బి.జయ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శ్రీ నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్రస్థాయి వృషభాల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు సబ్‌జూనియర్ సైజు ఎడ్ల పోటీలను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. సబ్‌జూనియర్ సైజ్ ఎడ్ల పోటీల్లో మొత్తం 7జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఈపోటీల్లో కర్నూలు వీఆర్ నగర్‌కు చెందిన గీతామృత చౌదరి ఎడ్లు 20 నిమిషాల్లో రాతిబండ (16ఘనపుటడుగుల)ను 3172 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఉయ్యాలవాడ మండలం తడమలదిన్నెకు చెందిన పేరెడ్డి సుబ్బారెడ్డి ఎడ్లు 3020 అడుగులు లాగి ద్వితీయ స్థానం, వెల్దుర్తి మండలం బాపురానికి చెందిన నడిపి సోమిరెడ్డి వృషభాలు 2908 అడుగులతో తృతీయ స్థానం, అనంతపురం జిల్లా తాడిచెర్లకు చెందిన బీమిరెడ్డి లవకుమార్ ఎడ్లు 2752.8అడుగులు లాగి నాలుగో స్థానం, బెళగల్ మండలం పోల్‌కల్‌కు చెందిన మహేంద్రనాయుడు ఎడ్లు 2532.3అడుగులు లాగి ఐదో స్థానం పొందాయి. బుధవారం విజేత ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు కొండయ్యచౌదరి, హరిప్రసాద్‌రెడ్డి, మిఠాయి నరసింహులు, రాందాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముగతి ఈరన్నగౌడ్, పల్లెపాడు రామిరెడ్డి, రైస్‌మిల్ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు స్వామిగౌడ్, రామకృష్ణ, పరశురాముడు, రంగన్న,జయన్న తదితరులు పాల్గొన్నారు.
నేడు సీనియర్ కేటగిరి పోటీలు
రాష్ట్రస్థాయి ఒంగోలు ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా బుధవారం సీనియర్ కేటగిరి సైజు ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన ఎడ్ల జతకు మొదటి బహుమతిగా రూ.60,000,ద్వితీయ బహుమతిగా రూ.50,000, తృతీయ బహుమతిగా రూ.35,000 , నాలుగో బహుమతిగా రూ.25,000,ఐదవ బహుమతిగా రూ.15,000 ఇస్తామని పోటీల నిర్వాహకులు బీవీ రైతు సంఘం కన్వీనర్‌లు కొండయ్యచౌదరి, మిఠాయి నరసింహులు, హరిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.