సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓజా బదిలీ అయ్యారు. ఆమెను వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్‌కు చెందిన శృతి ఓజా గతేడాది కాలంగా వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, తాండూరు రెవెన్యూ డివిజన్‌కు సబ్‌కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా(2014)ను నియమించారు. ముస్సోరీలో ఐఏఎస్ శిక్షణను పూర్తి చేసుకున్న ఝాకు ఇదే తొలి పోస్టింగ్. జిల్లాల పునర్విభజనలో భాగంగా తాండూరు కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆవిర్భవించింది. ఈ క్రమంలో ఐఏఎస్ స్థాయి అధికారిని సబ్‌కలెక్టర్‌గా నియమించడం గమనార్హం.