ప్రశాంతంగా ఎస్సై రాతపరీక్ష
Published Sun, Nov 27 2016 11:24 PM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM
కాకినాడ క్రైం :
జిల్లాలో సబ్ ఇ¯ŒSస్పెక్టర్ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎ¯ŒSటీయూకే) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సై ఉద్యోగాల కోసం జిల్లాలో 11,815 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాత పరీక్షను పేపర్–1, పేపర్–2 విభాగాల్లో ఉదయం, మ«ధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించారు. సబ్ ఇ¯ŒSస్పెక్టర్ రాత పరీక్షకు ఉదయం జరిగిన పేపర్–1కు 10,853 మంది హాజరుకాగా, 962 మంది గైర్హాజరైనట్టు జేఎ¯ŒSటీయూకే ప్రాంతీయ కన్వీనర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. మధ్యాçహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 10,844 మంది హాజరుకాగా, 971 మంది రాలేదన్నారు. ఈ దఫా జరిగిన రాత పరీక్షలో బయోమెట్రిక్ హాజరు నమోదులో అభ్యర్థులెవరూ పెద్దగా ఇబ్బంది పడలేదు. నవంబర్ నెల తొలివారంలో నిర్వహించిన కానిస్టేబుల్ రాత పరీక్షలో బయోమెట్రిక్ నమోదులో సక్రమంగా వేలిముద్రలు నమోదు కాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవడం తెలిసిందే. ఇప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రశాంత వాతావరణంలో రాత పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement