
ఘనంగా సిడిమాను ఉత్సవం
పట్టణ సమీపంలోని రససిద్ధులకొండపై వెలసిన శ్రీరస సిద్ధేశ్వరస్వామి సిడిమాను ఉత్సవం శుక్రవారం సాయంత్రం వేలాదిమంది భక్తుల సందడి మధ్య కనుల పండువగా జరిగింది.
రాయదుర్గం టౌన్ : పట్టణ సమీపంలోని రససిద్ధులకొండపై వెలసిన శ్రీరస సిద్ధేశ్వరస్వామి సిడిమాను ఉత్సవం శుక్రవారం సాయంత్రం వేలాదిమంది భక్తుల సందడి మధ్య కనుల పండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరగ్గా శుక్రవారం సిడిమాను ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సాయంత్రం 6 గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఉత్సవ విగ్రహానికి గంగపూజ నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.