ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17 వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–18 విభాగం పోల్‌వాల్ట్‌లో పిఠాపురానికి చెందిన ఎస్.రవి రజత పతకం సాధించాడు. పోల్‌వాల్ట్ ఫైనల్స్‌లో రవి ద్వితీయ స్థానం పొంది పతకం కైవసం చేసుకున్నట్టు కోచ్ సునీల్ దేశాయ్ తెలిపారు. 10వ తరగతి వరకు బ్లూస్టార్ హైస్కూల్‌లో చదివిన రవి ప్రస్తుతం హనుమంతరాయ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇంటర్ చదువుతున్నట్టు తెలి
పోల్‌వాల్ట్‌లో రవికి రజతపతకం
Sep 19 2016 9:13 PM | Updated on Sep 4 2017 2:08 PM
పిఠాపురం టౌన్:
ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17 వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–18 విభాగం పోల్‌వాల్ట్‌లో పిఠాపురానికి చెందిన ఎస్.రవి రజత పతకం సాధించాడు. పోల్‌వాల్ట్ ఫైనల్స్‌లో రవి ద్వితీయ స్థానం పొంది పతకం కైవసం చేసుకున్నట్టు కోచ్ సునీల్ దేశాయ్ తెలిపారు. 10వ తరగతి వరకు బ్లూస్టార్ హైస్కూల్‌లో చదివిన రవి ప్రస్తుతం హనుమంతరాయ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇంటర్ చదువుతున్నట్టు తెలిపారు. బ్లూస్టార్ హైస్కూల్‌లో కోచ్ సునీల్ దేశాయ్ శిక్షణ వల్ల తన ప్రతిభ మెరుగుపడిందని రవి తెలిపాడు. ఆయన నేతృత్వంలో జిల్లా సెంట్రల్ జోన్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించానని, అండర్ –19 విభాగంలో తృతీయ స్థానం సంపాదించి కాంస్యపతకం పొందానని తెలిపాడు. రాష్ట్రస్థాయిలో రజత పతకం సాధించిన రవిని స్కూల్ కరస్పాండెంట్ వి.పద్మకృష్ణవేణి, మేనేజర్ వి.జి.కె.గోఖలే, వి.ఎస్.కె.ఝాన్సీ, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పద్మనాభం, కార్యదర్శి సిహెచ్.వి.రమణ, జిల్లా సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు వై.తాతబ్బాయి, జాతీయ అథ్లెటిక్ కోచ్ కె.కొండలరావు అభినందించారు.
Advertisement
Advertisement