జఫర్‌గఢ్‌లో ‘సిట్‌’ దర్యాప్తు కలకలం | SIT investigation in jafferghad | Sakshi
Sakshi News home page

జఫర్‌గఢ్‌లో ‘సిట్‌’ దర్యాప్తు కలకలం

Published Mon, Aug 29 2016 12:04 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

SIT investigation in jafferghad

జఫర్‌గఢ్‌ : ఇటీవల పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం  దందాలపై విచారణ సాగిస్తున్న సిట్‌ బృందం జఫర్‌గఢ్‌ మండలంలో ఆదివారం పర్యటించినట్లు వదంతులు వ్యాపించడంతో మండలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకప్పుడు మావోయిస్టులకు జఫర్‌గఢ్‌ మండలంలో ప్రాబల్యం ఉండేది. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌ అయిన నయీంతోగానీ, అతడి అనుచరులతోగానీ ఈ ప్రాంతానికి చెందిన మాజీలకు, భూ దందాలు సాగించే వ్యక్తుల కు సంబంధాలు ఉన్నట్లు సిట్‌ అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మండలంలోని జఫర్‌గఢ్,  హిమ్మత్‌నగర్, తిడుగు గ్రామాల్లో పర్యటించినట్లు సమాచారం. ఈ విషయం ఆ నోటా, ఈ నోట మండలవ్యాప్తంగా తెలియడంతో సంచలనం సృష్టిం చింది. ఈ విషయమై ఆయా గ్రామాల్లో ఆరా తీయగా విచారణ కోసం సిట్‌ బృందం వచ్చినట్లు ఏ గ్రామానికి చెందినవారు స్పష్టం చేయకపోవడం గమనర్హాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement