jafarghad
-
బాబోయ్ ఎలుగుబంటి.. భయపెట్టేసింది
జఫర్‌గఢ్/న్యూశాయంపేట: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో శుక్రవారం ఎలుగుబంటి కనిపించింది. గ్రామంలో అకుల నర్సయ్య ఇంటి వద్ద ఉన్న చిం త చెట్టు పైకి ఎక్కి అరుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమా చారం ఇచ్చారు. రెస్క్యూ టీం సభ్యులు దూరం నుంచి మత్తు ఇంజక్షన్ వదలగా.. ఎలుగు బంటి చెట్టుపైనే స్పృహ తప్పింది. వెంటనే వల సాయంతో కిందకు దించి.. వాహనంలో హన్మకొండలోని జూ పార్కుకు తరలించారు. చదవండి: ధరల మంట.. బతుకు తంటా! -
బాలికను బావిలోకి తీసుకెళ్లి.. బాలికపై...
జఫర్‌గఢ్(స్టేషన్‌ఘన్‌పూర్): ఇంటి ముందు నిల్చున్న ఓ బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి, అతడు కూడా అందులో దూకి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు చేరుకుని అతడిపై దాడికి యత్నించగా గ్రామంలో ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బాలిక హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో రెండు రోజు ల క్రితమే ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు శనివారం వ్యవసాయ పనులకు వెళ్లారు. బాలిక మధ్యాహ్నం ఇంటి ముందు నిల్చొని ఉంది. గమనించిన పక్కింటి యువకుడు కేశోజు రాజేష్‌చారి(23) వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని రోడ్డు అవతలకు వెళ్తుండగా పెద్ద పెట్టున కేకలు వేసింది. విన్న స్థానికులు వస్తుండగా రాజేష్‌చారి ఆ బాలికను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు. అతడు కూడా బావిలో దూకాడు. బాలిక తలకు, కాళ్లకు గాయాలైనప్పటికీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బావి వద్దకు చేరుకున్న స్థానికులు పైనుంచి అతడిని బెదిరించి బాలికను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్, సీఐ కరుణాసాగర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై గ్రామస్తులు దాడికి యత్నించగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఫైరింజిన్‌ను కూడా తెప్పించారు. నిందితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. కాగా నిందితుడు రాజేష్‌చారి ఇంటర్మీడియట్ చదువు ఆపేసి గ్రామంలోని ఇసుక డంపుల వద్ద రోజువారీ కూలిగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు కుటుంబ సభ్యులు తరుచూ గొడవ పడేవారని, ఇతరులతో కూడా గొడవలకు దిగేవారని స్థానికులు తెలిపారు. రాజేష్‌చారిపై కేసు నమోదు ఉప్పుగల్లు గ్రామంలో బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి బావిలో పడేసి అత్యాచార యత్నానికి పాల్పడటంతోపాటు చంపేందుకు యత్నించాడనే ఫిర్యాదు మేరకు నిందితుడు కేశోజు రాజేష్‌చారిపై కేసు నమోదైనట్లు ఎస్సై వెంకటకృష్ణ శనివారం రాత్రి తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి 376, 366, 307 సెక్షన్ల కింద ఫోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
బావిలో నెట్టేసి బాలికపై అత్యాచారయత్నం
జఫర్‌గఢ్ (స్టేషన్‌ఘన్‌పూర్): ఇంటి ముందు నిల్చున్న ఓ బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేశాడు. అతడు కూడా అందులో దూకి అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించారు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బాలిక (17) హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చింది. ఆమె మధ్యాహ్నం ఇంటి ముందు నిల్చొని ఉండగా గమనించిన పక్కింటి యువకుడు కేశోజు రాజేష్‌చారి (23) వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని రోడ్డు అవతలకు వెళ్తుండగా బాలిక పెద్ద పెట్టున కేకలు వేసింది. స్థానికులు విని వస్తుండగా రాజేష్‌చారి ఆ బాలికను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు. అతడు కూడా బావిలో దూకాడు. బాలిక తల, కాళ్లకు గాయాలైనప్పటికీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అప్పటికే బావి వద్దకు చేరుకున్న స్థానికులు పైనుంచి అతడిని బెదిరించి బాలికను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన బాలికను వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికిదిగారు. -
తల్లి మందలించిందని విద్యార్థిని..
జఫర్‌గఢ్ : తల్లి మందలించిందని ఓ విద్యార్థిని మనస్తాపం చెంది పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జనగా మ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రవి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్ర ప్రత్యూష (16) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల ఓ విషయమై ప్రత్యూష ఆమె తల్లి మందలించింది. అప్పటి నుంచి తల్లి తనతో మాట్లాడడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జఫర్‌గఢ్‌లో ‘సిట్’ దర్యాప్తు కలకలం
జఫర్‌గఢ్ : ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం దందాలపై విచారణ సాగిస్తున్న సిట్ బృందం జఫర్‌గఢ్ మండలంలో ఆదివారం పర్యటించినట్లు వదంతులు వ్యాపించడంతో మండలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకప్పుడు మావోయిస్టులకు జఫర్‌గఢ్ మండలంలో ప్రాబల్యం ఉండేది. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ అయిన నయీంతోగానీ, అతడి అనుచరులతోగానీ ఈ ప్రాంతానికి చెందిన మాజీలకు, భూ దందాలు సాగించే వ్యక్తుల కు సంబంధాలు ఉన్నట్లు సిట్ అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మండలంలోని జఫర్‌గఢ్, హిమ్మత్‌నగర్, తిడుగు గ్రామాల్లో పర్యటించినట్లు సమాచారం. ఈ విషయం ఆ నోటా, ఈ నోట మండలవ్యాప్తంగా తెలియడంతో సంచలనం సృష్టిం చింది. ఈ విషయమై ఆయా గ్రామాల్లో ఆరా తీయగా విచారణ కోసం సిట్ బృందం వచ్చినట్లు ఏ గ్రామానికి చెందినవారు స్పష్టం చేయకపోవడం గమనర్హాం.