తల్లి మందలించిందని  విద్యార్థిని..  | Student Committing Suicide | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని  విద్యార్థిని.. 

Published Mon, Apr 2 2018 6:44 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Student Committing Suicide - Sakshi

మృతి చెందిన ప్రత్యూష

జఫర్‌గఢ్‌ : తల్లి మందలించిందని ఓ విద్యార్థిని మనస్తాపం చెంది పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జనగా మ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం హిమ్మత్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రవి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్ర ప్రత్యూష (16) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల ఓ విషయమై ప్రత్యూష ఆమె తల్లి మందలించింది. అప్పటి నుంచి తల్లి తనతో మాట్లాడడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం  వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement