కమనీయం శివపార్వతుల కల్యాణోత్సవం | siva parvathi kalyanam in kambadur | Sakshi

కమనీయం శివపార్వతుల కల్యాణోత్సవం

Published Thu, Feb 23 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

కమనీయం శివపార్వతుల కల్యాణోత్సవం

కమనీయం శివపార్వతుల కల్యాణోత్సవం

కంబదూరు : శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం మండల కేంద్రంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేసిన కల్యాణమండపంలో ఉదయం వేదపండితులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతిచౌదరి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలాంబ్రాలు సమర్పించారు. మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామివారిని పూలరథంలో ఉరేగించారు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రామాంజినేయులు, ఆలయ ఈఓ రామాంజినేయులు, జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ శ్రీరాములు, టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి దండా వెంకటేశులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ సురేంద్ర, అర్చకులు మంజునాథ్, దుర్గాప్రసాద్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలిశంకరప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement