mallikarjuna temple
-
1,500 ఏళ్ల క్రితమే పట్నం చిత్రాలు?
సాక్షి, హైదరాబాద్: కొమురవెల్లి మల్లికార్జున దేవాలయం, ఇతర దేవాలయాల్లోనూ జాతరలసమయంలో పట్నం ముగ్గు వేయడం ఆచారం. అయితే దాదాపు 1,500 ఏళ్ల కిందటే ఈ తరహా చిత్రాలను ఓ పెద్ద బండరాతిపై వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. చూడడానికి కొంత భిన్నంగా ఉన్నా.. అది పట్నం ముగ్గు లాంటిదేనని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. ఆదిమానవులు బండ రాళ్లపై చెట్ల పసరు, జంతు రక్తం, చమురు, రంగురాళ్ల పొడితో ఎర్ర రంగు తయారుచేసి గీసిన బొమ్మలు చాలాచోట్ల వెలుగు చూశాయి. అలాగే ఇక్కడ కూడా ఎర్ర రంగుతో ఈ చిత్రాలు వేసి ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామ శివారులోని అడవిలో శితారి (చిత్తారు)గట్టు మైసమ్మ గుట్టమీద వీటిని గుర్తించారు. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శివానంద వెలుగులోకి తెచ్చారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. అందులో వృత్తం, వాటిలోపల మళ్లీ వృత్తాలు, మధ్యలో చేతులెత్తి నిలబడ్డ మనిషి ఆకృతిని పోలిన చిత్రం, వృత్తం నుంచి బయటకు పొడుచుకొచ్చినట్టుగా కిరణాలు గీశారు. స్థానికులు దీన్ని మైసమ్మగా కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవి మత, ధార్మిక విశ్వాసాలకు సంబంధించినవని, 1,500 ఏళ్లకు పూర్వం గీసినవై ఉంటాయని హరగోపాల్ చెప్పారు. -
భూకబ్జాపై 'సాక్షి' కథనానికి స్పందించిన అధికారులు
సాక్షి, సిద్ధిపేట : కోమురవేల్లి మల్లికార్జున స్వామి దేవాలయ భూ కబ్జాపై 'సాక్షి'లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజీవ్ రహదారికి అనుకొని ఉన్న 7ఎకరాల దేవాలయ స్థలాన్ని భూ భకాసురులు కబ్జా చేసిన తీరును సాక్షి టీవీ ప్రసారం చేసింది. దీంతో భూ కబ్జాదారులపై చర్యలకు ఉపక్రమించారు. అయితే దీని వెనుక రాజకీయనేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే దేవాదాయశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 100కోట్ల విలువ చేసే స్థలాన్ని ఆక్రమించేసి ఇల్లు నిర్మాణం చేపట్టినా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చూస్తూ ఉండిపోయారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా దీని వెనుక రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉందేమో అని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని విఙ్ఞప్తి చేస్తున్నారు. (అరకొరగానే సహకారం: రూ.25లక్షలు అవసరం) -
కమనీయం శివపార్వతుల కల్యాణోత్సవం
కంబదూరు : శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం మండల కేంద్రంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేసిన కల్యాణమండపంలో ఉదయం వేదపండితులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతిచౌదరి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలాంబ్రాలు సమర్పించారు. మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామివారిని పూలరథంలో ఉరేగించారు. మార్కెట్ యార్డు చైర్మన్ రామాంజినేయులు, ఆలయ ఈఓ రామాంజినేయులు, జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, సర్పంచ్ శ్రీరాములు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి దండా వెంకటేశులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సురేంద్ర, అర్చకులు మంజునాథ్, దుర్గాప్రసాద్, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలిశంకరప్ప పాల్గొన్నారు. -
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
ఎన్పీకుంట (కదిరి) : మండల కేంద్రంలోని మల్లిఖార్జునస్వామి ఆలయంలోని శివలింగాన్ని గురువారం సూర్యకిరణాలు తాకాయి. ఆలయ అర్చకులు నాగేశ్వరస్వామి యథావిధిగా స్వామివారి తలుపులు తెరిచి పూజలు చేస్తుండగా ఈ దృశ్యం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుందన్నారు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయానికి వెళ్లేటప్పుడు.. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యడు పయనించేటప్పుడు ఇలా జరుగుతుందని అర్చకులు తెలిపారు. -
కనులపండువగా సాగిన ధర్మప్రచార రథయాత్ర
పగిడ్యాల(కర్నూలు జిల్లా): లోక క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని నెహ్రూనగర్ గ్రామంలో కొనసాగిన ధర్మప్రచార రథయాత్ర భక్తుల జనసందోహాం మధ్య కనులపండువగా సాగింది. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన రథయాత్రకు గ్రామంలోని ప్రజలు పాల్గొని భక్తిప్రపత్తులను ప్రదర్శించారు. గ్రామానికి చేరుకున్నా ధర్మప్రచార రథానికి సర్పంచ్ శేషమ్మ, సింగిల్‌విండో ఛైర్మన్ కట్టుబడి శ్రీనివాసులునాయుడు, ఎంపీటీసీలు రంగన్న, పద్మావతమ్మ, గ్రామపెద్దలు లోకానందరెడ్డి, మండ్ల సుధాకర్, సత్యమయ్యశెట్టిలు ఘన స్వాగతం పలికారు. పడమర నెహ్రూనగర్ నుంచి తూర్పు నెహ్రూనగర్‌లోని ఎల్లంబావి, పీకే ప్రాగటూరు వరకు భక్తుల కేరింతల మద్య బాణా సంచా పేల్చుతూ మంగళ వాయిద్యాలు, భాజభజంత్రీలు, తప్పెట్లతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్థానిక శ్రీరాములు దేవాలయం వద్ద శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలను దేవస్థాన అర్చకులు వైభవోపేతంగా జరిపించారు. ఈ వేడుకలను తిలకించడానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు నిశ్చయ తాంబులాదులను సమర్పించి భక్తిని చాటుకున్నారు.