కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద శుక్రవారం స్కార్పియో వాహనం వనమాలి (6) బాలికను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వనమాలి అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వనమాలి ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో వాహన డ్రైవర్ ఆ విషయాన్ని గమనించ లేదు. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.