సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం | softwere engineer died | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం

Published Mon, Nov 21 2016 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

softwere engineer died

పట్టణ శివారులోని ప్రభుత్వ గోదాముల సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందాడు.

ఆళ్లగడ్డ : పట్టణ శివారులోని ప్రభుత్వ గోదాముల సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందాడు. మండంలోని నల్లగట్ల గ్రామానికి చెందిన బండి చంద్ర (28)హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సెలవుపై గ్రామానికి వచ్చిన యువకుడు సోమవారం పని మీద ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చాడు. రాత్రి బైక్‌పై తిరిగి వెళ్తుండగా  పట్టణ శివారులో గోదాముల వద్ద హైవేపైకి చేరుకోగానే నంద్యాల వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్‌ వేగంగా ఢీకొంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement