సౌర వెలుగులు | solar power plants in mominpet | Sakshi
Sakshi News home page

సౌర వెలుగులు

Published Wed, Apr 27 2016 4:15 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

సౌర వెలుగులు - Sakshi

సౌర వెలుగులు

మోమిన్‌పేట ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు
రోజుకు 7.5 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 3.5 మెగావాట్లు

జిల్లాలో సౌర వెలుగులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పరిగి ప్రాంతంలో మెగా సౌర విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమవుతుండగా మోమిన్‌పేట సమీపంలోనూ మూడు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. గతంలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ప్లాంట్ నుంచి 3.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా మరో మూడు మెగావాట్లసామర్థ్యం కలిగిన రెండు చిన్నసోలార్ విద్యుత్ ప్లాంట్లు తుది రూపు దిద్దుకుంటున్నాయి. - మోమిన్‌పేట

 మోమిన్‌పేటకు సమీపంలో ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రూ.12 కోట్లతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వెల్‌చాల్ గ్రామ శివారులో పెన్నార్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రూ.55 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి 2.5 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రావులపల్లి గ్రామ శివారులో ఒరిస్సా పవర్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ రూ.62 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూడు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మోమిన్‌పేట : మోమిన్‌పేట మండలంలో సోలార్ వెలుగులు మరింతగా విరజిమ్మనున్నాయి. ఇక్కడ ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రోజుకు 3.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా నూతనంగా ఇంకో మూడు మెగావాట్ల విద్యుత్ ఇంకొన్ని రోజులలో ఉత్పత్తి కానుంది. ప్రస్తుతం మోమిన్‌పేటకు సమీపంలో రోజుకు ఒక మెగావాట్ (5000 యూనిట్లు) విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వెల్‌చాల్ గ్రామంలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

నూతనంగా మండల పరిధిలోని రావులపల్లిలో మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు చివరి దశకు వచ్చాయి. ఇంకొన్ని రోజులలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరం చేస్తుంది. సౌర విద్యుత్ ప్లాంట్ల వల్ల మండలంలో లోఓల్టేజీతోపాటు విద్యుత్ కోతలకు అస్కారం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది.

 ఏడెకరాల విస్తీర్ణంలో...
మండల కేంద్రానికి సమీపంలో ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.12 కోట్లతో ఏడెకరాల విస్తీర్ణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక మెగావాట్  విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వెల్‌చాల్ గ్రామ శివారులో పెన్నార్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.55 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రావులపల్లి శివారులో ఒడిశా పవర్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.62కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 3 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు పను లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తు తం ఉత్పత్తి విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కాగానే ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.

మండలంలో మూడు అదనపు సబ్ స్టేషన్లు...
మండలంలో ప్రస్తుతం ఒక 33/11కేవీ సబ్‌స్టేషన్ మాత్రమే ఉంది. ఆదనంగా 33/11 కేవీల మూడు సబ్‌స్టేషన్‌లు, 133/11కేవీ ఒక సబ్ స్టేషన్ మంజూరుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ప్రభుత్వం రెండు సబ్‌స్టేషన్‌లు మంజూరు చేసింది. స్థల పరిశీలన జరగడంతో త్వరలో వీటి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

 లోఓల్టేజీ సమస్య తీరింది..: రవికుమార్, ఏఈఈ
లోఓల్టేజీ సమస్య తీరింది. రెండేళ్లుగా 3.5మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గతంలో లోఓల్టేజీతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. రావులపల్లిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సదాశివపేట సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement