MW
-
మరో 2,500 మెగావాట్లు అవసరం
- రాష్ట్ర విద్యుత్ సమస్యలపై సమీక్షలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ - కేంద్ర విద్యుత్ మంత్రి గోయల్‌తో చర్చిస్తామని వెల్లడి - రైతులకు కనీసం 12 గంటల విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్య లకు త్వరలో పరిష్కారం లభించేలా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు జరుపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మంగళ వారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రా నికి మరో 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని, రైతులకు కనీసం 12 గంటలు విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దేశమంతటా 24 గంటల విద్యుత్ అందించాలన్నది ప్రధాని మోదీ సంక ల్పమని తెలిపారు. హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్లు నిర్మించాలని దత్తాత్రేయ చెప్పగా.. అందుకు రూ.350 కోట్లు అవసరమ వుతాయని అధికారులు తెలిపారు. వ్యవసా యానికి, వ్యవసాయేతర అవసరాలకు విడి విడిగా విద్యుత్ సరఫరా ఉండాలని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రంలో ప్రతిఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 9,150 గ్రామాల్లో 5.65 లక్షల ఇళ్లలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి రూ.3 వేల చొప్పున సబ్సిడీ కల్పించడానికి కేంద్రం రూ.1,107 కోట్లు కేటాయించిందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌కు సహాయం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజ నలో భాగంగా నాణ్యమైన విద్యుత్ అందించ డానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. గ్రామీణ విద్యుత్ సంస్థ ద్వారా మూడేళ్లలో రూ.30 వేల కోట్లను రాష్ట్రానికి కేటాయించామన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర అవసరాలకు ప్రత్యేక లైన్లకు రూ.2,300 కోట్లు అవసరమని, స్మార్ట్ మీటర్ల కోసం రూ.788 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర విద్యుత్ అధికారులు వివరించారని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్ల ద్వారా శక్తిని పొదుపు చేసేందుకు టీఎస్ఎన్పీడీసీఎల్కు రూ.1,543 కోట్లు మం జూరు చేశామన్నారు. సూర్యాపేటలో 400/ 200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనుల కోసం, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 400/200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనులకు రూ.1,107 కోట్లు టీఎస్ ట్రాన్స్‌కోకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ కల్లోలం సృష్టించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ అశాంతితో కొట్టుమిట్టాడుతూ అభివృద్ధి ఎజెండాను కాదని.. మతకల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ ఆరోపించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ఆరోపణలు చేయడం సముచితం కాదని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పోలీసులను అప్రతిష్టపాలు చేయడం సరైనది కాదని, జాతికి సంబంధించిన అంశంపై సంయమనంతో మాట్లాడాలన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత లెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దిగ్విజయ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సౌర వెలుగులు
♦ మోమిన్‌పేట ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ♦ రోజుకు 7.5 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు ♦ ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 3.5 మెగావాట్లు జిల్లాలో సౌర వెలుగులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పరిగి ప్రాంతంలో మెగా సౌర విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమవుతుండగా మోమిన్‌పేట సమీపంలోనూ మూడు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. గతంలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ప్లాంట్ నుంచి 3.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా మరో మూడు మెగావాట్లసామర్థ్యం కలిగిన రెండు చిన్నసోలార్ విద్యుత్ ప్లాంట్లు తుది రూపు దిద్దుకుంటున్నాయి. - మోమిన్‌పేట మోమిన్‌పేటకు సమీపంలో ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రూ.12 కోట్లతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వెల్చాల్ గ్రామ శివారులో పెన్నార్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రూ.55 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి 2.5 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రావులపల్లి గ్రామ శివారులో ఒరిస్సా పవర్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ రూ.62 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూడు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మోమిన్‌పేట : మోమిన్‌పేట మండలంలో సోలార్ వెలుగులు మరింతగా విరజిమ్మనున్నాయి. ఇక్కడ ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రోజుకు 3.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా నూతనంగా ఇంకో మూడు మెగావాట్ల విద్యుత్ ఇంకొన్ని రోజులలో ఉత్పత్తి కానుంది. ప్రస్తుతం మోమిన్‌పేటకు సమీపంలో రోజుకు ఒక మెగావాట్ (5000 యూనిట్లు) విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వెల్చాల్ గ్రామంలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నూతనంగా మండల పరిధిలోని రావులపల్లిలో మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు చివరి దశకు వచ్చాయి. ఇంకొన్ని రోజులలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరం చేస్తుంది. సౌర విద్యుత్ ప్లాంట్ల వల్ల మండలంలో లోఓల్టేజీతోపాటు విద్యుత్ కోతలకు అస్కారం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది. ఏడెకరాల విస్తీర్ణంలో... మండల కేంద్రానికి సమీపంలో ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.12 కోట్లతో ఏడెకరాల విస్తీర్ణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వెల్చాల్ గ్రామ శివారులో పెన్నార్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.55 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రావులపల్లి శివారులో ఒడిశా పవర్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.62కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 3 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు పను లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తు తం ఉత్పత్తి విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కాగానే ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. మండలంలో మూడు అదనపు సబ్ స్టేషన్లు... మండలంలో ప్రస్తుతం ఒక 33/11కేవీ సబ్‌స్టేషన్ మాత్రమే ఉంది. ఆదనంగా 33/11 కేవీల మూడు సబ్స్టేషన్లు, 133/11కేవీ ఒక సబ్ స్టేషన్ మంజూరుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ప్రభుత్వం రెండు సబ్స్టేషన్లు మంజూరు చేసింది. స్థల పరిశీలన జరగడంతో త్వరలో వీటి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. లోఓల్టేజీ సమస్య తీరింది..: రవికుమార్, ఏఈఈ లోఓల్టేజీ సమస్య తీరింది. రెండేళ్లుగా 3.5మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గతంలో లోఓల్టేజీతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. రావులపల్లిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సదాశివపేట సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తున్నారు. -
కృష్ణపట్నం, హిందూజా విద్యుత్‌కు ఓకే
డిస్కంల అంచనాలకు ఈఆర్సీ ఆమోదం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 52,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని తెలంగాణ ఈఆర్సీ అంచనా వేసింది. కృష్ణపట్నం నుంచి 5,600 మిలియన్ యూనిట్లు, హిందూజా నుంచి 3,650 మిలి యన్ యూనిట్ల విద్యుత్తు వస్తుందని డిస్కంలు వేసిన అంచనాలకు ఈఆర్సీ ఆమో దం తెలిపింది. ఏపీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల పేచీ ఉన్న కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు నుంచి 53.89 శాతం విద్యుత్తు వాటా తమకే దక్కుతుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో స్పష్టం చేశాయి. జనవరి నుంచి కృష్ణపట్నం మొదటి యూని ట్ 431 మెగావాట్లు, ఏప్రిల్‌లో రెండో యూనిట్ నుంచి మరో 431 మెగావాట్లు సమకూరుతుంది. ఏప్రిల్ 15 నుంచి హిందూజా మొదటి యూనిట్ ద్వారా 280 మెగావాట్లు, జులై 15 నుంచి రెండో యూనిట్ ద్వారా 280 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని డిస్కంలు ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. వీటిని పరిశీలించి ఆమోదం తెలిపినట్లుగా ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ వెల్లడించారు. ఏపీ ఇచ్చే విద్యుత్తు వాటాలు తీసుకోవాలా.. వద్దా.. అని రాష్ట్ర ప్రభుత్వం వెనుకా ముందాడుతున్న తరుణంలో ఈఆర్సీ అనుమతి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
రాష్ట్రానికి ‘ఝజ్జర్’ కాంతులు
వచ్చే నెల నుంచి 222 మెగావాట్లు ఊహించని విధంగా కేంద్రం విద్యుత్ కేటాయింపులు అక్టోబర్ నుంచి 374 మెగావాట్లకు పెంపు సెప్టెంబర్ వరకు ఏపీకీ 304 మెగావాట్లు ఢిల్లీ వదులుకున్న వాటాను పంచిన కేంద్ర సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ‘ఇందిరాగాంధీ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు’(ఐజీఎస్టీపీఎస్) నుంచి ఉత్పత్తవుతున్న 693 మెగావాట్లను గతంలో కేంద్రం ఢిల్లీకి కేటాయించగా.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరెంటును కేంద్రానికి తిరిగిచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పునఃకేటాయింపుల్లో భాగంగా.. ఈ విద్యుత్ నుంచి 304 మెగావాట్లను ఆంధ్రప్రదేశ్‌కు, 222 మెగావాట్లను తెలంగాణకు, 167 మెగావాట్లను కేరళకు కేటాయించింది. మూడు రాష్ట్రాలకు వచ్చే నెల(ఏప్రిల్) 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ విద్యుత్ పంపిణీ జరగనుంది. తర్వాత అక్టోబర్ నుంచి తెలంగాణకు ఝజ్జర్ నుంచి వచ్చే కోటా 374 మెగావాట్లకు పెరగనుంది. ఈ మేరకు 2015 అక్టోబర్ 1 - 2016 మార్చి 31 మధ్య కాలంలో ఝజ్జర్ విద్యుత్ పంపిణీలో భాగంగా మరో కోటాను కేంద్రం నిర్ణయించింది. మొత్తం 693 మెగావాట్లలో తెలంగాణకు 374 మెగావాట్లు, కేరళకు 319 మెగావాట్లు కేటాయించింది. ఈ మేరకు జరిపిన పునః కేటాయింపులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ)కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.గుహ ఈ నెల 19న లేఖ రాశారు. -
‘అంగుల్-పలాస’ ఆర్నెళ్లలో అసాధ్యమే!
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం తప్పని నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండులైన్లు నిర్మిస్తోంది. 4500 మెగావాట్ల విద్యుత్ ప్రసారం చేసే సామర్థ్యంతో అంగుల్-పలాస, వార్ధా-డిచ్పల్లి లైన్లు నిర్మాణంలో ఉన్నాయి. అంగుల్-పలాస లైన్ ఐదారు నెలల్లో పూర్తవుతుంది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇక డిచ్పల్లి లైను మరో 18 నెలలు పడుతుంది.’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవలఅసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తెలంగాణకు విద్యుత్ రావడానికి ఆ లైన్ వేగంగా పూర్తవుతుందా..? అని పరిశీలిస్తే, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చేపట్టిన లైన్ల నిర్మాణం మరో ఏడాదిన్నరలోపు పూర్తయ్యేలా లేదని తేలింది. ఒడిశాలో ఉన్న అంగుల్ నుంచి పలాసకు దాదాపు 370 కిలోమీటర్లు. రెండేళ్ల కిందటే పవర్‌గ్రిడ్ శ్రీకాకుళం ప్యాకేజీ పేరిట ఈ పనులకు టెండర్లు పిలిచింది. వచ్చే ఏడాది జూలై నాటికి దీనిని పూర్తి చేయాల్సి ఉంది. కానీ వేగంగా జరగడం లేదని ఏప్రిల్‌లో జరిగిన జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్‌లో చర్చ జరిగింది. వేమగిరి ప్యాకేజీదీ అదే పరిస్థితి... అక్కడి నుంచి రాజమండ్రి మీదుగా ఖమ్మం, హైదరాబాద్ వరకు మరో 780 కిలోమీటర్లు లైన్ల నిర్మాణం మొదలైంది. వేమగిరి ప్యాకేజీ పేరిట ఉన్న ఈ లైన్ల నిర్మాణం ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి. అయితే ఇవి కూడా గడువులోగా పూర్తయ్యేలా లేవు. అభ్యంతరాలు, సామర్థ్యం పెంపు అంశాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులటరీ కమిషన్ పరిధిలో ఆలస్యం కావడంతో పనులు ఆగిన ట్టు తెలుస్తోంది. అనుమతులన్నీ లభించి ఈ రెండు కారిడార్లు వేగంగా పూర్తయినా, వచ్చే ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహేశ్వరం లైన్‌కు రెండున్నరేళ్లు .... ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్ధా, అక్కడినుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మీదుగా మహేశ్వరం వరకు లైన్ల నిర్మాణం పురోగతిలో ఉంది. ఇప్పటికే వార్ధాదాకా లైన్ పూర్తయింది. అక్కడి నుంచి మహేశ్వరం దాకా 560 కిలోమీటర్ల లైన్ ఇంకా టెండర్ల దశలోనే ఉంది. వెంటనే పనులు ప్రారంభించినా, నిర్మాణం పూర్తయ్యే సరికి కనీసం రెండున్నరేళ్లు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. అప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అవకాశం లేనట్టే. రాయచూర్-షోలాపూర్ లైన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయినప్పటికీ కారిడార్‌ను బుక్ చేసుకోవడంలో ఉమ్మడిప్రభుత్వం విఫలమైంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకపోవడ ఇప్పుడు శాపంగా పరిణమించింది. తమిళనాడు ప్రభుత్వం రెండేళ్ల కిందటే 4500 మెగావాట్లకు కారిడార్‌ను రిజర్వు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్న వెంటనే కారిడార్‌ను రిజర్వు చేసుకుంటే కొత్తలైన్లు పూర్తయ్యేదాకా ఎదురుచూపులు తప్పవనే వాదనలున్నాయి. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఎప్పుడు వస్తుందోనని అధికారులు పెదవి విరుస్తున్నారు.