21న ఏకపాత్రాభినయం పోటీలు
Published Tue, Jul 26 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
నిజామాబాద్‌కల్చరల్: నిజామాబాద్ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఆగస్టు 21న మధాహ్నం 3 గంటల నుంచి స్థానిక ఔత్సాహిక యువ కళాకారులకు జిల్లాస్థాయి ఏకపాత్రాభినయం పోటీలను నిర్వహిస్తున్నట్లు మురళీకృష్ణ కళా నిలయం అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ పి. రాంమోహన్‌రావు, సింహాద్రి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థ మరో నాలుగేళ్లలో స్వర్ణోత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో యువతలోని ప్రతిభను వెలికితీసే సదుద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైస్కూల్, కళాశాల విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు.ఎంట్రీలను ఆగస్టు 6 లోగా సంస్థ కార్యాలయానికి అందజేయాలని వారు తెలిపారు.
Advertisement
Advertisement