rajiv gandhi auditorium
-
21న ఏకపాత్రాభినయం పోటీలు
నిజామాబాద్‌కల్చరల్: నిజామాబాద్ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఆగస్టు 21న మధాహ్నం 3 గంటల నుంచి స్థానిక ఔత్సాహిక యువ కళాకారులకు జిల్లాస్థాయి ఏకపాత్రాభినయం పోటీలను నిర్వహిస్తున్నట్లు మురళీకృష్ణ కళా నిలయం అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ పి. రాంమోహన్‌రావు, సింహాద్రి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థ మరో నాలుగేళ్లలో స్వర్ణోత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో యువతలోని ప్రతిభను వెలికితీసే సదుద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైస్కూల్, కళాశాల విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు.ఎంట్రీలను ఆగస్టు 6 లోగా సంస్థ కార్యాలయానికి అందజేయాలని వారు తెలిపారు. -
18న ‘మరణం తరువాత ఏమౌతుంది’ ?
* జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ధార్మిక సమావేశం * హాజరు కానున్న వివిధ మతాల ప్రముఖులు ఇందూరు : నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 18న సాయంత్రం ఏడు గంటలకు ‘మరణం తరువాత ఏమౌతుంది’ అంశంపై ఒక గొప్ప ధార్మిక సమావేశం నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ శేఖ్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనిషి మరణం తరువాత జరిగే పరిణామాలు ఏమిటీ ? మన ధార్మిక గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి..? తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి వక్తలుగా సనాతన ధార్మిక పరిషత్ రాష్ర్ట కార్యదర్శి రామానంద సరస్వతి, పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోల్మాన్ జాషువా, ఇస్లామియా ధార్మిక పండితులు మౌలానా మొహమ్మద్ రఫిక్‌లు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కుల, మత,స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ హాజరు కావాలని కోరారప్రశ్నోత్తరాల సమయం ఉంటుందన్నారు. ఆహ్వానితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. -
అంగన్‌వేడి
కలెక్టరేట్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు ముందుజాగ్రత్తగా ప్రధాన ద్వారం ముందు ముళ్ల కంచెలు వేసి, అంగన్వాడీ కార్యకర్తలను నిలువరించారు. పది మంది మాత్రమే లోపలకు వెళ్లి తమ సమస్యలను అధికారులకు చెప్పుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో పది మంది అంగన్వాడీ కార్య కర్తలు డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు రమేష్‌బాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎంతోకాలంగా సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పట్టణ ,గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు, బాలింతలకు, ఆరేళ్లలోపు పిల్లలకు సేవలందించడంలోనూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు.దళిత,గిరిజన,బడుగు,బలహీన వర్గా లు అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సేవలు ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం సమస్యలను పరిష్కరిస్తామని గవర్నర్, సీఎం హామీ ఇచ్చారని, కానీ ఫలితంలేదన్నారు. అంగన్వాడీలను నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు 15 వేల రూపాయల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కరువైందని, రిటైర్మంట్ బెనిపిట్స్ కల్పించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సెంటర్ అద్దెలు, బిల్లులు, టీఏ, డీఏలు ఇవ్వాలన్నారు. అమృత హస్తం బిల్లులను అంగన్వాడీల అకౌంట్లో జమ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నూర్జహన్, గోవర్ధన్, గంగాధర్, భారతి , రాజలింగం,సువర్ణ, దేవగంగుతో పాటు సుమారు రెండు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గులాబీరెపరెపలే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. పది రోజులుగా క్యాంపులో ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు నేరుగా నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియానికి చేరుకున్నారు. వీరితో పాటు ఎక్స్అఫీషియో సభ్యు లు,ఎమ్మెల్సీ లు ధర్మపురి శ్రీనివాస్, డి. రాజేశ్వర్, ఎ మ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త కూడా ఎన్నికలలో పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు ఆ ధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదట తెలుగు అక్షరమాల ప్రకారం 50 మంది కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం మేయర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. మహిళా జనరల్‌కు రిజర్వు చేసిన ఈ స్థానంలో మొదటి నుం చి చామకూర విశాలినీరెడ్డి పేరును ప్రచారంలోకి తెచ్చిన టీఆర్ఎస్ చివరి నిముషంలో బీసీ వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ ఆకుల సుజా త ను వ్యూహాత్మకంగా తెరపైకి తేవడం చ ర్చనీయాంశంగా మారింది. చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ నుంచి కాపర్తి సుజాత పేరుతో ‘బి’ఫారం దాఖలు కాగా, ఆ ఇద్దరి మధ్యన చేతులెత్తే విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 10 మంది టీఆర్ ఎస్, 16 మంది ఎంఐఎం, ముగ్గురు బీజేపీ సభ్యులతోపాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బి.రాజేశ్వర్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త మద్దతు పలకడంతో టీఆర్ఎస్ అభ్యర్థికి 31 ఓట్లు వచ్చాయి. 16 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతోపాటు ఇద్దరు రెబల్స్, బీజేపీ సభ్యులు ముగ్గురు, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ ఓటుతో కాపర్తి సుజాతకు 22 మంది మద్దతు లభించింది. దీం తో తొమ్మిది ఓట్ల ఆధిక్యం సాధించిన ఆకుల సుజాతను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ రావు మేయర్‌గా ప్రకటించారు. అనంతరం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం నుంచి ఎండీ ఫయీమ్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎవరినీ పోటీకి దింపకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కామారెడ్డిలో కాంగ్రెస్ కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకుంది. చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెం దిన పిప్పిరి సుష్మ, వైస్ చైర్మన్‌గా మసూద్‌అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది, ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఒకరితో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఎన్నికల్లో పాల్గొన్నారు. పూర్తి కోరం ఉండడంతో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం బీజే పీ, టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఎం సభ్యులు ఓటింగును బహిష్కరించినా, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ప్రకటించారు. బోధన్,ఆర్మూర్‌లలో కాంగ్రెస్‌కు బీటలు బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో కాం గ్రెస్ పార్టీల కోటలకు బీటలు వారాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో రెండింట్లో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి అధిక స్థానాలను గెలిచినా టీఆర్ఎస్ వ్యూహాన్ని నిలువరించలేక పోయింది. బోధన్ మున్సిపల్లో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చాటింది. ఈసారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వ్యుహం ఫలించ లేదు. ఎంఐఎం మద్దతు పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు పార్టీకి ఆఖరి క్షణంలో ఎంఐఎం షాక్ఇచ్చింది. దీంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కూటమి విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్కు చెందిన ఆరవ వార్డు కౌన్సిలర్ ఎ. ఎల్లయ్య (ఎల్లం) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 10వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ హబీబ్‌ఖాన్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి చైర్మన్‌గా ఆబిద్అలీ పోటీ చేశారు. ఎల్లంకు ఎంఎల్ఏ అహ్మద్ షకీల్ ఓటు తోపాటు 21 ఓట్లు రాగా, ఆబిద్అలీకి 13 మంది మద్దతు ఇచ్చారు. మొత్తం 35 వార్డులుం డగా, కాంగ్రెస్‌కు 15 మంది, టీఆర్ఎస్కు 9 మంది, బీజేపీకి ముగ్గురు, ఎంఐఎంకు ఏడుగురు, టీడీపీకి ఒకరు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 33 మంది కౌన్సిలర్లు ప్రమాణస్వీకారానికి హాజరుకాగా ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజర్ కావడంతో టీఆర్ఎస్కు విజయం చేరువయ్యింది. కథ అడ్డం తిరిగి.. ఆర్మూరులో కాంగ్రెస్ పన్నిన కిడ్నాప్ వ్యూహం ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’లా బెడిసికొట్టింది. 23 మంది వార్డు కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు ( ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి) కలిపి 25 మంది హాజరు కావాల్సి ఉండగా, 21 మంది హాజరయ్యారు. నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు, టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా కశ్యప్ స్వాతిసింగ్ బబ్లూను రంగంలోకి దిగారు. ఆమెకు పదమూడు ఓట్లు వచ్చాయి. అందులో పది మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాగా, ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు, ఒకరు బీజేపీ కౌన్సిలర్ ఉన్నారు. కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా బొగడమీది శ్రీదేవిని ప్రతిపాదించారు. ఆమెకు ఎనిమిది ఓట్లు వచ్చాయి. అందులో ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కాగా ఒకరు టీడీపీ కౌన్సిలరు. దీంతో స్వాతి సింగ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజ యం సాధించినట్లు ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ యాదిరెడ్డి ప్రకటించారు. వైస్ చైర్ పర్సన్‌గా టీఆర్ఎస్కు చెందిన మోత్కూరి లింగాగౌడ్ ఎన్నికయ్యారు. -
‘దుకాణం’ దక్కేదెవరికో..?
- నేడు వైన్‌షాపులకు లక్కీడ్రా - 127 దుకాణాలకు 993 దరఖాస్తులు - మూడింటికి నిల్.. భారీగా తగ్గిన టెండర్లు నిజామాబాద్ క్రైం: అదృష్టం ఎవరిని వరిస్తుందో.. కొన్నిగంట ల్లో తేలనుంది. జిల్లాలోని మద్యం దుకాణాలకు సంబంధించిన లక్కీడ్రాను సోమవారం నిర్వహిం చనున్నారు. ఇందుకు జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో గల 93దుకాణాల్లో మూడు దుకాణాలు మినహ 90దుకాణాలకు 721దరఖాస్తులు వచ్చాయి. కోటగిరి, ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి, వార్డు నం.10 దుకాణాలకు టెండర్లు రాలేదు. కామారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని 37దుకాణాలకు గానూ అన్నింటికీ దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ నగర శివారు బోర్గాం(పి) మద్యం దుకాణం కోసం 28 దరఖాస్తులు, డిచ్పల్లి మండలం ఇందల్వాయి వైన్‌షాపునకు 34దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి కూడా మహిళలు టెండర్లలో పాల్గొన్నారు. చివర్లో పెరిగిన దరఖాస్తులు మద్యం షాపులకు అధికారులు టెండర్లు ఆహ్వానించిన తర్వాత మొదటి మూడురోజులు అంతంత మాత్రంగానే వచ్చాయి. చివరి రెండురోజులు మాత్రం వ్యాపారులతో ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయం కిటకిటలాడింది. చివరిరోజైన శనివారం సాయంత్రం ఐదుగంటల లోపు కార్యాలయంలోకి వచ్చి, టెండర్ఫారం చూపినవారికి అధికారులు టోకన్లు ఇచ్చారు. అనంతరం వచ్చిన వారిని అనుమతించలేదు. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అవి సక్రమంగా ఉన్నాయా.. లేదా పరిశీలించాకే టెండర్బాక్స్లో వేయనిచ్చారు. ఈ ప్రక్రియ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. భారీగా తగ్గుదల జిల్లాలో 2014-15 సంవత్సరానికి 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. 2012లో జరిగిన టెండర్లతో పోల్చితే ఈసారి భారీగా తగ్గాయి. అప్పుడు 142 మద్యం దుకాణాలకు టెండర్లు పిలువగాా, 17షాపులు మినహా.. 125దుకాణాలకు 1,538 దరఖాస్తులు వచ్చాయి. గత టెండర్లతో పోల్చితే ఈసారి 545 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. 2012లో 17దుకాణాలకు టెండర్లు రాకపోగా.. ఈఏడాది మూడింటికి టెండర్లు రాలేదు. ఈ దుకాణాలు లాభసాటిగా లేవన్న కారణంగానే టెండర్లు వేసేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు. గతంలో ఇవే దుకాణాలకు దాదాపు 8సార్లు టెండర్లు పిలిచినా స్పందన రాలేదు. రెండున్నర కోట్ల ఆదాయం ఈ ఏడాది కేవలం దరఖాస్తుల రూపంలోనే ఎక్సైజ్‌శాఖకు దాదాపు రూ.రెండున్నర కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 993 దరఖాస్తులకు ఒక్కో దరఖాస్తు రూ.25వేల చొప్పున అంటే రూ.2కోట్ల 48లక్షల 25వేల ఆదాయం వచ్చింది. డ్రా కోసం ఏర్పాట్లు పూర్తి జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగారాం తెలిపారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టెండర్లకు డ్రా తీయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేయకుండా, లక్కీడ్రా ద్వారా దుకాణాలను కేటాయించటాన్ని నిరసిస్తూ పలు పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. టెండర్లను అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీల వారు ప్రయత్నాలు చేశాయి. టెండర్లు రద్దు చేయాలంటూ వేదిక వైపు దూసుకువచ్చారు. ఈసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. -
ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఎక్కడో ఏదో జరిగిందంటూ వ్యాపించే వదంతులను నమ్మవద్దని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ మో హన్‌రావు ప్రజలకు సూచించారు. ఇందుకు అన్ని వర్గాలవారూ సహకరించాలని కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శుక్రవా రం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లోనే గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్న కీర్తి ఉందన్నారు. దీనిని నిలబెట్టుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. గొడవలకు పాల్పడేవారిని ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు. అనుమానాస్పద వ్యక్తులుగాని, వస్తువులు గాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అనుమానితులపై నిఘా పెంచామన్నారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాం నగరంలో అవసరమైన చోట రోడ్ల నిర్మా ణం, మరమ్మతులు చేపట్టామని కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు తెలిపారు. గణేశ్ మండళ్ల వద్ద, నిమజ్జన శోభాయాత్ర సాగే దారుల్లో చెత్త పడేయొద్దని ప్రజలకు సూచించారు. సంస్థలో పారిశుధ్య కార్మికుల కొరత ఉందని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. నిమజ్జనం కోసం స్థలం కేటాయించాలి ‘నగరంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గణేశ్ నిమజ్జ నం కోసం నగర శివారు ప్రాంతంలో ప్రభు త్వ భూమిలోంచి కొంత స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుంది’ అని శాంతికమిటీ సభ్యుడు, బోర్గాం ఉపసర్పంచ్ గంగారెడ్డి(చిరంజీవి) అధికారులకు సూచించారు. నగరంలోని గణేశ్ విగ్రహాలను వినాయక్‌నగర్ బావి, బోర్గాం వాగు, బాసరలోని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. నది లో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల తాగునీరు కలుషితమవుతోందని పలువు రు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగర శివారులోనే స్థలం కేటాయించాలని సూచించారు. సమావేశంలో నగర డీఎస్పీ అనిల్‌కుమార్, ఎస్హెచ్ఓ నర్సింగ్ యాదవ్, సీఐలు సైదులు, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌కుమార్, తహశీల్దార్ రాజేందర్ పాల్గొన్నారు.