గులాబీరెపరెపలే | akula sujatha elected as nizamabad mayor | Sakshi
Sakshi News home page

గులాబీరెపరెపలే

Published Fri, Jul 4 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

akula sujatha elected as nizamabad mayor

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. పది రోజులుగా క్యాంపులో ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు నేరుగా నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియానికి చేరుకున్నారు. వీరితో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యు లు,ఎమ్మెల్సీ లు ధర్మపురి శ్రీనివాస్, డి. రాజేశ్వర్, ఎ మ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త కూడా ఎన్నికలలో పాల్గొన్నారు.

 జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వర్‌రావు ఆ ధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదట తెలుగు అక్షరమాల ప్రకారం 50 మంది కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం మేయర్ ఎన్నిక ప్రక్రియను  చేపట్టారు. మహిళా జనరల్‌కు రిజర్వు చేసిన ఈ స్థానంలో  మొదటి నుం చి చామకూర విశాలినీరెడ్డి పేరును ప్రచారంలోకి తెచ్చిన టీఆర్‌ఎస్ చివరి నిముషంలో బీసీ వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ ఆకుల సుజా త ను వ్యూహాత్మకంగా తెరపైకి తేవడం చ ర్చనీయాంశంగా మారింది.

 చేతులెత్తి
 కాంగ్రెస్ పార్టీ నుంచి కాపర్తి సుజాత పేరుతో ‘బి’ఫారం దాఖలు కాగా, ఆ ఇద్దరి మధ్యన చేతులెత్తే విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 10 మంది టీఆర్ ఎస్, 16 మంది ఎంఐఎం, ముగ్గురు బీజేపీ సభ్యులతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బి.రాజేశ్వర్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త మద్దతు పలకడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 31 ఓట్లు వచ్చాయి.

16 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతోపాటు ఇద్దరు రెబల్స్, బీజేపీ సభ్యులు ముగ్గురు, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ ఓటుతో కాపర్తి సుజాతకు 22 మంది మద్దతు లభించింది. దీం తో తొమ్మిది ఓట్ల ఆధిక్యం సాధించిన ఆకుల సుజాతను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ రావు మేయర్‌గా ప్రకటించారు. అనంతరం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం నుంచి ఎండీ ఫయీమ్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎవరినీ పోటీకి దింపకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

 కామారెడ్డిలో కాంగ్రెస్
 కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకుంది. చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెం దిన పిప్పిరి సుష్మ, వైస్ చైర్మన్‌గా మసూద్‌అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది, ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఒకరితో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఎన్నికల్లో పాల్గొన్నారు. పూర్తి కోరం ఉండడంతో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం బీజే పీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఎం సభ్యులు ఓటింగును బహిష్కరించినా, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

 బోధన్,ఆర్మూర్‌లలో కాంగ్రెస్‌కు బీటలు
 బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో కాం గ్రెస్ పార్టీల కోటలకు బీటలు వారాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో రెండింట్లో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి అధిక స్థానాలను గెలిచినా టీఆర్‌ఎస్ వ్యూహాన్ని నిలువరించలేక పోయింది. బోధన్ మున్సిపల్‌లో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చాటింది. ఈసారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వ్యుహం ఫలించ లేదు.

 ఎంఐఎం మద్దతు పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు పార్టీకి ఆఖరి క్షణంలో ఎంఐఎం షాక్‌ఇచ్చింది. దీంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూటమి విజయకేతనం ఎగురవేసింది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరవ వార్డు కౌన్సిలర్ ఎ. ఎల్లయ్య (ఎల్లం) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 10వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ హబీబ్‌ఖాన్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 కాంగ్రెస్ నుంచి చైర్మన్‌గా ఆబిద్‌అలీ పోటీ చేశారు. ఎల్లంకు ఎంఎల్‌ఏ అహ్మద్ షకీల్ ఓటు తోపాటు 21 ఓట్లు రాగా, ఆబిద్‌అలీకి 13 మంది మద్దతు ఇచ్చారు. మొత్తం 35 వార్డులుం డగా, కాంగ్రెస్‌కు 15 మంది, టీఆర్‌ఎస్‌కు 9 మంది, బీజేపీకి ముగ్గురు, ఎంఐఎంకు ఏడుగురు, టీడీపీకి ఒకరు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 33 మంది కౌన్సిలర్‌లు ప్రమాణస్వీకారానికి హాజరుకాగా ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్‌లు గైర్హాజర్ కావడంతో టీఆర్‌ఎస్‌కు విజయం చేరువయ్యింది.

 కథ అడ్డం తిరిగి..
 ఆర్మూరులో కాంగ్రెస్ పన్నిన కిడ్నాప్ వ్యూహం ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’లా బెడిసికొట్టింది. 23 మంది వార్డు కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు ( ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి) కలిపి 25 మంది హాజరు కావాల్సి ఉండగా, 21 మంది హాజరయ్యారు. నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు, టీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కశ్యప్ స్వాతిసింగ్ బబ్లూను రంగంలోకి దిగారు.

ఆమెకు పదమూడు ఓట్లు వచ్చాయి. అందులో పది మంది టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాగా, ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు, ఒకరు బీజేపీ కౌన్సిలర్ ఉన్నారు. కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బొగడమీది శ్రీదేవిని ప్రతిపాదించారు. ఆమెకు ఎనిమిది ఓట్లు వచ్చాయి. అందులో ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కాగా ఒకరు టీడీపీ కౌన్సిలరు. దీంతో స్వాతి సింగ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజ యం సాధించినట్లు ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ యాదిరెడ్డి ప్రకటించారు. వైస్ చైర్ పర్సన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన మోత్కూరి లింగాగౌడ్ ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement