18న ‘మరణం తరువాత ఏమౌతుంది’ ?
* జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ధార్మిక సమావేశం
* హాజరు కానున్న వివిధ మతాల ప్రముఖులు
ఇందూరు : నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 18న సాయంత్రం ఏడు గంటలకు ‘మరణం తరువాత ఏమౌతుంది’ అంశంపై ఒక గొప్ప ధార్మిక సమావేశం నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ శేఖ్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనిషి మరణం తరువాత జరిగే పరిణామాలు ఏమిటీ ? మన ధార్మిక గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి..? తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
సమావేశానికి వక్తలుగా సనాతన ధార్మిక పరిషత్ రాష్ర్ట కార్యదర్శి రామానంద సరస్వతి, పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోల్మాన్ జాషువా, ఇస్లామియా ధార్మిక పండితులు మౌలానా మొహమ్మద్ రఫిక్‌లు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కుల, మత,స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ హాజరు కావాలని కోరారప్రశ్నోత్తరాల సమయం ఉంటుందన్నారు. ఆహ్వానితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.