‘ప్రత్యేక’ దగా
– ప్రత్యేకSహోదా 15 ఏళ్లుకావాలని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు
– ఇప్పుడు అవసరం లేదంటూ కొత్త పల్లవి
– హోదాతో అభివద్ధి బాటన 11 రాష్ట్రాలు
– ‘అనంత’ లాంటి వెనుకబడిన ప్రాంతాలకు హోదానే సంజీవని
– ‘ప్రత్యేక హోదా.. ఏపీ హక్కు’ అనే అంశంపై నేడు ‘సాక్షి’ చైతన్య పథం
సాక్షిప్రతినిధి, అనంతపురం :
→ ‘ప్రధాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. పరిశ్రమలు ఏర్పడి, ఉత్పత్తి సాధించేలోపు ఐదేళ్లు పూర్తవుతాయి. ఏపీకి మేలు జరగాలంటే పదేళ్లు హోదా ప్రకటించండి.’
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014 ఆమోద సమయంలో వెంకయ్య నాయుడు
→ ‘కనీసం 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివద్ధి చెందుతుంది. లేదంటే తీరని అన్యాయం జరుగుతుంది. 15 ఏళ్లు హోదా ఇవ్వాలని మోదీని అడుగుతున్నా.’
– 2014 తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు
→ ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది? అంతకంటే ప్యాకేజీతోనే మేలు కలుగుతుంది. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు.’
– తాజాగా వెంకయ్య, చంద్రబాబు వ్యాఖ్యలు
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో రాజధాని లేదు. హైదరాబాద్‌ను కోల్పోవడంతో పరిశ్రమలు దూరమయ్యాయి. తద్వారా ఆదాయం భారీగా తగ్గింది. ఈ క్రమంలో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికాభివద్ధి వేగం పుంజుకుని ఆర్థికంగా మేలు కలుగుతుంది. ఇదే విషయాన్ని వెంకయ్య నాయుడుతో పాటు ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణŠ జైట్లీ 2014లో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోద సమయంలో ప్రస్తావించారు. పదేళ్లు ఇవ్వాలని yì మాండ్ చేశారు. అయితే.. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేకSహోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంది. దీంతో రాష్ట్రానికి హోదా వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ కుంటిసాకులు చెబుతూ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాభివద్ధి కోసం పోరాడాల్సిన ఏపీ ప్రభుత్వం పూర్తిగా కేంద్రానికి లొంగిపోయింది. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజీతో అంతకంటే మేలు జరుగుతుందని చంద్రబాబు కొత్తపల్లవి అందుకున్నారు. ఆయన వైఖరి వల్ల రాష్ట్రానికి, మరీముఖ్యంగా ‘అనంత’లాంటి వెనుకబడిన ప్రాంతాలకు తీరని నష్టం జరుగుతోంది.
హోదాతోనే ‘అనంత’ అభివద్ధి
అనంతపురం జిల్లాలో 19.13 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఇందులో 13 శాతం అటవీ భూములు ఉన్నాయి. అటవీ భూములను మినహాయించగా.. మిగిలిన భూముల్లో 69 శాతం వ్యవసాయ యోగ్యమైనవి. తక్కిన 31శాతం భూముల్లో వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపిస్తే జిల్లా పారిశ్రామికంగా అభివద్ధి చెందుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. లక్షలాది ఎకరాల పొలాలు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్నాయి. జిల్లా సరిహద్దులకు 400 కిలోమీటర్ల దూరంలో గోవా పోర్టు ఉంది. అయినప్పటికీ దశాబ్దాలుగా ‘అనంత’లో పారిశ్రామికాభివద్ధి జరగలేదు. తాడిపత్రి సమీపంలో అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్, గరుడస్టీల్స్ మినహా జిల్లాలో పరిశ్రమల జాడ లేదు. వెయ్యిమంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ప్రకటిస్తే జిల్లాలో అత్యంత వేగంగా పారిశ్రామికాభివద్ధి జరిగే అవకాశముంది.