revolutions
-
పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇదే సమయం
సాక్షి, హైదరాబాద్, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇదే ఉత్తమ సమయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఇంటర్ప్రీనర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ వద్ద కేటాయించిన ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (డబ్ల్యూఐటీటీసీ) కేంద్రానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏకకాలంలో ఐదు విప్లవాలు హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవంతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్త్రం దేశానికి ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. రా్రష్తంలోని అన్ని జిల్లాలు పారిశామ్రిక ప్రగతికి అత్యధికంగా వనరులున్నాయన్నారు. వీటిని పారిశ్రామికవెత్తలు అందిపుచ్చుకొని గ్రామీణ స్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితేనే సమతుల్యత సాధించగలమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకొని వాటిని సాధించేందుకు కృషి చేస్తే అద్భుతాలు సాధ్యమన్నారు. ఎలీప్ అధ్యక్షురాలు రమాదేవి కన్నెగంటి మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం కేవలం 5 మంది పారిశ్రామికవేత్తలతో ప్రారంభమైన అలీప్లో ఇప్పుడు 10వేల మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ జి.బాలమల్లు, డబ్ల్యూఐటీటీసీ వైస్ చైర్పర్సన్ జ్యోతి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెజ్లర్లకు న్యాయం చేయాలి: కేటీఆర్ లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న దీక్షకు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మద్దతు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై విచారణ జరిపి, వారికి న్యాయం చేయాలని శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ‘ఒలంపిక్స్‌లో పతకాలు సాధించి వారు దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పుడు మనం ఉత్సవాలు జరుపుకొన్నాం. ప్రస్తుతం వారు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికీ సంఘీభావం తెలుపుదాం. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి, రెజ్లర్లకు న్యాయం అందించాలి’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రెజ్లర్ల సమస్యను పరిష్కరించాలి: కవిత రెజ్లర్లకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ వేదికలపై మన అథ్లెట్లు కనపరిచిన ప్రతిభను చూసి ఉత్సవాలు చేసుకున్నాం. మన అథ్లెట్లు గ్లోబల్ ఐకాన్స్. వారు మనను ఎంతో ప్రభావితం చేస్తున్నారు. మన అథ్లెట్లు చెబుతున్న సమస్యను విని, దేశ భవిష్యత్ దృష్ట్యా వారి సమస్యను పరిష్కరించాలి’అని ఆమె శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
మెరుపులనే దారి మళ్లించారు!
పారిస్: మెరుపంటేనే వేగానికి పెట్టింది పేరు. వేగానికి అత్యుత్తమ ఉపమానం కూడా. మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు!! అతి శక్తిమంతమైన లేజర్ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు. పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్స్ లేబొరేటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు. ఇందుకోసం ఏకంగా మూడు టన్నుల బరువు, కారు పరిమాణమున్న లేజర్ పరికరాన్ని ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్ పర్వత శిఖరంపై 2,500 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. దానిద్వారా సెకనుకు ఏకంగా 1,000కి పైగా అతి శక్తిమంతమైన కిరణాలను ఆకాశంలో మెరుపులకేసి పంపించారు. తొలి ప్రయత్నంలోనే వాటి దారిని 160 అడుగుల దాకా మళ్లించగలిగారు. రెండు హైస్పీడ్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించారు. ‘‘అతి శక్తిమంతమైన లేజర్ కిరణాలను ఆకాశంలోకి పంపినప్పుడు శక్తిమంతమైన కాంతితో కూడిన ఫిలమెంట్లు ఏర్పడతాయి. అవి గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులను అయానీకరిస్తాయి. ఈ చర్య ఫలితంగా స్వేచ్ఛగా కదలాగే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ప్లాస్మాగా పిలిచే ఈ అయానీకరణ చెందిన గాలి ఎలక్ట్రాన్ల వాహకంగా పని చేస్తుంది’’ అంటూ ఈ టెక్నాలజీ పని చేసే తీరును డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ పియరీ వూల్ఫ్ వివరించారు. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత 1970ల్లోనే ప్రతిపాదించినా ఇప్పటిదాకా ల్యాబుల్లోనే ప్రయోగించి చూశారు. బయటి వాతావరణంలో ప్రయోగం జరపడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్ ఫోటానిక్స్‌లో పబ్లిషయ్యాయి. వీటి సాయంతో పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తేగల హై పవర్ లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు! -
నవ్యకు తెలుగులో 99 మార్కులు
జన్నారం (ఖానాపూర్): తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్యకు న్యాయం జరిగింది. ఈ నెల 21న ‘సాక్షి’మెయిన్‌లో ‘ఫస్ట్ ఇయర్లో టాప్–సెకం డియర్‌లో ఫెయిల్ ’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కుల మెమోను వాట్సాప్ ద్వారా కరిమల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌కు పంపారు. ఈ విషయంపై డీఐఈవో ఇంద్రాణిని ఫోన్లో సంప్రదించగా, దీనిపై ఏవో రమేశ్‌ను విషయం కనుక్కోవాలని నేరుగా ఇంటర్ బోర్డుకు పంపినట్లు తెలిపారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయించగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీంతో నవ్యకు మొత్తం సబ్జెక్టుల్లో కలిపి 924 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న నవ్య సంతోషం వ్యక్తం చేసింది. -
ఎన్నాళ్లో వేచిన హృదయం
దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే. 2015లో.. ఎల్జీబీటీ యాక్టివిస్ట్ హరీష్ అయ్యర్ వాళ్ల అమ్మ పద్మాఅయ్యర్ ఓ ప్రకటన పట్టుకొని పత్రికాఫీసులన్నీ తిరిగింది. దాన్ని చూసిన వాళ్లంతా కనీసం మాట కూడా మాట్లాడకుండా ‘వేయలేం’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపి ఆమెను పంపించేశారు. చివరకు హిందుస్థాన్ టైమ్స్ ఒప్పుకుంది ఆ ప్రకటన వేయడానికి. అన్ని వార్తా పత్రికలు తిరస్కరించిన ఆ ప్రకటన ఏంటి?ఆమె కొడుకు కోసం పెళ్లికొడుకు ప్రకటన! ‘‘ఎన్జీవోలో పనిచేస్తున్న 36 ఏళ్ల నా కొడుకు కోసం వరుడు కావాలి. అయిదు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తుండే నా కొడుక్కి.. జంతు ప్రేమికుడు, శాకాహారి, మంచి ఉద్యోగం చేస్తున్నజతగాడు కావాలి. అయ్యర్ కులస్తులకు ప్రాధాన్యం. అయినా క్యాస్ట్ నో బార్’’ ఇదీ ఆ ప్రకటన సారాంశం. ఇది పత్రికల వాళ్లకే కాదు.. ఎల్జీబీటీలను పౌరులుగా చూడని చోట్లల్లా సంచలనమే అయింది. హరీష్ అయ్యర్‌కు లైఫ్ పార్టనర్ దొరికాడా లేదా అన్నది అప్రస్తుతం. ఒక తల్లి అభ్యర్థన ఎంత నవ్వుల పాలైంది? ఒక మనిషి వ్యక్తిగత ఆసక్తిని ఎందుకు కించపరిచారన్నది చర్చనీయాంశం. దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది. సుప్రీంకోర్టు తీర్పుతో. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) హక్కులనూ గౌరవిస్తూ.. వాళ్లనూ పౌరులుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. దేశంలో ఇంకేం సమస్యలు లేనట్టు కొంతమంది అసహజ ప్రవర్తనకు గ్రీన్ సిగ్నల్ రావడాన్ని ఇంత సంబరంగా ఎందుకు చూస్తున్నారు.. అని చాలా మంది ఈసడించుకున్నారు. ఇంకెంతో మంది ‘‘అయిపోయింది.. దేశం గంగలో కలుస్తోంది’’ అంటూ పెదవి విరిచారు. అతి కొద్ది మంది మాత్రమే ‘‘ఇన్నాళ్లకు వాళ్ల పోరాటం ఫలించింది. వాళ్ల ఆత్మగౌరవానికీ గుర్తింపు దొరికింది’’ అంటూ సంతోషపడ్డారు. నిజమే, దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే. ఆకలినైనా ఓర్చుకుంటాం.. కాని ఆత్మాభిమానం దెబ్బతింటే తట్టుకోలేం. పోరుకు సిద్ధపడతాం. మిగతా పోరాటాలన్నిటికీ అంగీకారం దొరికినప్పుడు ఎల్జీబీటీల స్ట్రగుల్ మాత్రం ఎందుకు సమ్మతం కాకూడదు? వాళ్ల హక్కులకు గుర్తింపు ఎందుకు ఉండకూడదు? దీని మీద న్యాయపోరాటానికి సిద్ధపడింది ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ‘‘స్వలింగ సంపర్కం నేరం కాదు. అది అసహజమూ కాదు.. అంటువ్యాధి అంతకన్నా కాదు! అదొక బయోలాజికల్ ఫెమినా..!’’ అంటూ తీర్పునిచ్చింది. ఎల్జీబీటీకి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377ను సడలించింది. నిజంగా ఇప్పుడు ఇది సంచలనమే. ద్వంద్వ ప్రమాణాల సమాజంలో ఎన్నో తర్జనభర్జనల అనంతరం సుప్రీం ఈ తీర్పునివ్వడం నిజంగా ఊరటే. ద్వంద్వ ప్రమాణాలు అంటే మనందరికీ కోపం రావచ్చు. ఖజురహోలో స్వలింగ సంపర్క శిల్పాలను కళగా ఆస్వాదిస్తాం.. ఆమోదిస్తాం. ఏ కళ అయినా సమాజ జీవితానికి ప్రతిబింబమే కదా! శిల్పాలుగా ఆ గోడల మీదకు ఎక్కాయి అంటే అది జనబాహుళ్యంలో ఉన్నట్టే కదా! బయట ఒప్పుకోవడానికి సంస్కృతీసంప్రదాయాలు అడ్డు తగులుతాయి. అందుకే ద్వంద్వప్రమాణాలు అన్నది. ఆకర్షణ బయోలాజికల్ ఇన్స్టింక్ట్. మానసిక రుగ్మత కాదు. ఎల్జీబీటీలను ఎల్‌జీబీటీలుగానే గుర్తించి.. గౌరవిస్తే.. సమాజమంతా ఎల్‌జీబీటీలుగా మారరు. అది ఫ్యాషన్ కాదు.. ట్రెండ్ కాదు.. సుప్రీంకోర్టే చెప్పినట్టు అంటువ్యాధి అంతకన్నా కాదు. గుర్తించకపోతేనే అనర్థం.అయితే కోర్టు తీర్పుతో అంతా మారిపోదు. ముందు ఇంట్లోంచే ఆమోదం మొదలు కావాలి. స్కూళ్లు, కాలేజీలు.. కార్యాలయాలు.. వాళ్లను థర్డ్ సిటిజన్స్‌గా కాదు.. సిటిజన్స్‌గా ఐడెంటిటీ ఇవ్వడం ప్రారంభించాలి. అభివృద్ధికి నమూనా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడటం కాదు.. అందరి హక్కులను గౌరవించడం. పౌరులు అందరికీ ఈక్వల్ స్పేస్ ఇవ్వడం! ప్రకృతే వీళ్లను ఆదరించినప్పుడు మనమూ దాని బిడ్డలమే.. వీళ్లకు సోదరీసోదరులమే కదా! మనమెందుకు అక్కున చేర్చుకోకూడదు?! సరస్వతి రమ -
ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: మమత
కోల్‌కతా: వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బెంగాల్లో అధికారం కోసం బీజేపీ కలలు కనడం మానేసి కేంద్రంలో అధికారం నిలుపుకోవడంపై దృష్టిపెట్టాలని, ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశంలోని వివిధ పార్టీ ల తిరుగుబాటు శంఖారావాలు వినిపించడం లేదా? రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని ఎన్నికలు ఫలితాలు మీకు అర్థం కావడం లేదా?’ అని ఆమె ప్రశ్నించారు. -
‘ప్రత్యేక’ దగా
– ప్రత్యేకSహోదా 15 ఏళ్లుకావాలని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు – ఇప్పుడు అవసరం లేదంటూ కొత్త పల్లవి – హోదాతో అభివద్ధి బాటన 11 రాష్ట్రాలు – ‘అనంత’ లాంటి వెనుకబడిన ప్రాంతాలకు హోదానే సంజీవని – ‘ప్రత్యేక హోదా.. ఏపీ హక్కు’ అనే అంశంపై నేడు ‘సాక్షి’ చైతన్య పథం సాక్షిప్రతినిధి, అనంతపురం : → ‘ప్రధాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. పరిశ్రమలు ఏర్పడి, ఉత్పత్తి సాధించేలోపు ఐదేళ్లు పూర్తవుతాయి. ఏపీకి మేలు జరగాలంటే పదేళ్లు హోదా ప్రకటించండి.’ - ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014 ఆమోద సమయంలో వెంకయ్య నాయుడు → ‘కనీసం 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివద్ధి చెందుతుంది. లేదంటే తీరని అన్యాయం జరుగుతుంది. 15 ఏళ్లు హోదా ఇవ్వాలని మోదీని అడుగుతున్నా.’ – 2014 తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు → ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది? అంతకంటే ప్యాకేజీతోనే మేలు కలుగుతుంది. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు.’ – తాజాగా వెంకయ్య, చంద్రబాబు వ్యాఖ్యలు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో రాజధాని లేదు. హైదరాబాద్‌ను కోల్పోవడంతో పరిశ్రమలు దూరమయ్యాయి. తద్వారా ఆదాయం భారీగా తగ్గింది. ఈ క్రమంలో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికాభివద్ధి వేగం పుంజుకుని ఆర్థికంగా మేలు కలుగుతుంది. ఇదే విషయాన్ని వెంకయ్య నాయుడుతో పాటు ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణŠ జైట్లీ 2014లో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోద సమయంలో ప్రస్తావించారు. పదేళ్లు ఇవ్వాలని yì మాండ్ చేశారు. అయితే.. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేకSహోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. దీంతో రాష్ట్రానికి హోదా వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ కుంటిసాకులు చెబుతూ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాభివద్ధి కోసం పోరాడాల్సిన ఏపీ ప్రభుత్వం పూర్తిగా కేంద్రానికి లొంగిపోయింది. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజీతో అంతకంటే మేలు జరుగుతుందని చంద్రబాబు కొత్తపల్లవి అందుకున్నారు. ఆయన వైఖరి వల్ల రాష్ట్రానికి, మరీముఖ్యంగా ‘అనంత’లాంటి వెనుకబడిన ప్రాంతాలకు తీరని నష్టం జరుగుతోంది. హోదాతోనే ‘అనంత’ అభివద్ధి అనంతపురం జిల్లాలో 19.13 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఇందులో 13 శాతం అటవీ భూములు ఉన్నాయి. అటవీ భూములను మినహాయించగా.. మిగిలిన భూముల్లో 69 శాతం వ్యవసాయ యోగ్యమైనవి. తక్కిన 31శాతం భూముల్లో వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపిస్తే జిల్లా పారిశ్రామికంగా అభివద్ధి చెందుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. లక్షలాది ఎకరాల పొలాలు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్నాయి. జిల్లా సరిహద్దులకు 400 కిలోమీటర్ల దూరంలో గోవా పోర్టు ఉంది. అయినప్పటికీ దశాబ్దాలుగా ‘అనంత’లో పారిశ్రామికాభివద్ధి జరగలేదు. తాడిపత్రి సమీపంలో అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్, గరుడస్టీల్స్ మినహా జిల్లాలో పరిశ్రమల జాడ లేదు. వెయ్యిమంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ప్రకటిస్తే జిల్లాలో అత్యంత వేగంగా పారిశ్రామికాభివద్ధి జరిగే అవకాశముంది.