రీవాల్యుయేషన్ అనంతరం వచ్చినమార్కులు
జన్నారం (ఖానాపూర్): తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్యకు న్యాయం జరిగింది. ఈ నెల 21న ‘సాక్షి’మెయిన్‌లో ‘ఫస్ట్ ఇయర్‌లో టాప్–సెకం డియర్‌లో ఫెయిల్ ’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కుల మెమోను వాట్సాప్ ద్వారా కరిమల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌కు పంపారు.
ఈ విషయంపై డీఐఈవో ఇంద్రాణిని ఫోన్‌లో సంప్రదించగా, దీనిపై ఏవో రమేశ్‌ను విషయం కనుక్కోవాలని నేరుగా ఇంటర్ బోర్డుకు పంపినట్లు తెలిపారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయించగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీంతో నవ్యకు మొత్తం సబ్జెక్టుల్లో కలిపి 924 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న నవ్య సంతోషం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment