కోల్‌కతా: వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బెంగాల్‌లో అధికారం కోసం బీజేపీ కలలు కనడం మానేసి కేంద్రంలో అధికారం నిలుపుకోవడంపై దృష్టిపెట్టాలని, ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశంలోని వివిధ పార్టీ ల తిరుగుబాటు శంఖారావాలు వినిపించడం లేదా? రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని ఎన్నికలు ఫలితాలు మీకు అర్థం కావడం లేదా?’ అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment