హద్దు మీరిన వాట్సప్ పోస్టింగులతో ప్రమాదం
♦ అపరిచితులను గ్రూపులో చేర్చుకోవద్దు
♦ అడ్మినిస్ట్రేటర్‌కు చిక్కులు తప్పవంటున్న నిపుణులు
టేక్మాల్: వాట్సాప్‌లో ఎడాపెడా గ్రూపులు క్రియేట్ చేసేస్తున్నారా? అడ్మినిస్ట్రేటర్‌గా గ్రేట్ అనుకుంటున్నారా? జాగ్రత్త. మీ గ్రూపులో ఎవరెవరు ఉంటున్నారో? వాళ్లు ఏమేమి పోస్టు చేస్తున్నారో? తెలుసుకోండి. ఎందుకంటే వాళ్లు చేస్తే ప్రతి పోస్టింగుకు మీరే బాధ్యులవుతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండకపోతే చిక్కుల్లో పడొచ్చు. కేసు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కితే మీ చేతికి బేడీలు పడొచ్చు. సో.. బీ కేర్ ఫుల్. డిజిటల్ యుగంలో సామాజిక మాద్యమాలు సమచార విప్లవానికి ఊపరిలూడుతున్నాయి. గతంలో తెగిపోయిన స్నేహ బంధాలను తిరిగి ముడి వేసుకోవడానికి, కొత్త మిత్రులను పరిచయం చేసుకోవడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్.. తదితరాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం సర్వసాధారణం కావడంతో ఈ సోషల్ మాద్యమాల వినిమయం కూడా ఎక్కువైంది. ఏదైనా సమాచారాన్ని పంపిచుకోవాలన్నా.. లేక ఫొటోలను అందిపుచ్చుకోవాలన్నా క్షణాల్లో జరిగిపోతోంది. ఈక్రమంలో వాట్సప్‌పై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు.
జిల్లాలో 90 శాతం
జిల్లాలో 90 శాతానికిపైగా ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లు వినియోగిస్తున్నారు. అందునా వాట్సప్‌లో ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువతీ.. యువకులు, రైతులు ఇలా ప్రతిఒక్కరూ వాట్సప్‌లో గ్రూపులో ఏర్పాటుచేసుకుంటున్నారు. అవసరం మేరకు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు.
బాధ్యత తప్పదు
ఎడాపెడా గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, గంటల తరబడి చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. కొందరికి వ్యసనంగా ఆవహించింది. స్నేహితులను పెంచుకోవడం, మధురమైన పోస్టింగులు చేస్తే ఓకే కానీ.. అప్రమత్తంగా లేకపోతే చిక్కులు తప్పవు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్ గ్రూప్‌పై ఓ కన్ను వేసి ఉంచాల్సిందే! లేకపోతే ఎవరూ చేసిన అసభ్యకర, దేశ సమగ్రతను దెబ్బతీసే పోస్టింగులకు అడ్మినిస్ట్రేటర్ బాధ్యత వహించక తప్పదు. భాతర ఐటీ చట్టం ప్రకారం ఆన్‌లైన్ గ్రూపునకు బాధ్యులుగా ఎవరు ఉంటే వారినే బాధ్యుడిని చేస్తారు. కాబట్టి తెలిసిన స్నేహితులనే సభ్యులుగా చేర్చుకోవడం ఉత్తమం.
చట్టం ఏం చెబుతుంది?
భారత ఐటీ చట్టం 2000 ప్రకారం కఠినమైన శిక్షలుంటాయి. అభ్యంతకర విషయాలను పోస్టు చేస్తే ఐపీసీ సెక్షన్ 505, 1(బీ) కింద కేసులు నమోదు చేస్తారు. ఐటీ చట్టం 153, 34,67, సెక్షన్‌లూ వర్తిస్తాయి. ఈక్రమంలో వాట్సప్ గ్రూపు నుంచి సభ్యులను తొలగించారన్నా కారణంగా ద్వేషాలు పెంచుకోవడం, అడ్మిన్‌లపై దాడి జరిగిన సంఘటనలు సైతం ఇటీవల పెరిగాయి. వాట్సప్‌ను ఎవరు దుర్వినియోగం చేసినా ఐటీ చట్టం అడ్మిన్‌పైనే గురి పెడుతోంది. ఎందుకంటే వాట్సప్‌లో మెసేజ్ ఎవరు సృష్టించారో తెలుసుకునే అవకాశం లేదు. అయితే, దాన్ని వ్యాప్తి చేసేవారిని గుర్తు పెట్టుకోవడం చాలా సులువు. ఇదే దర్యాప్తులో లూప్‌హోల్. మరో వైపు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదూ.. ఎవరు పోస్టు చేశారన్నదే కీలకం. ఎవరో పంపితే పొస్టు చేశానంతే.. అంటే చట్టం ఒప్పుకొదు. కాబట్టి అడ్మిన్‌కే చిక్కులు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
♦ దేశ భద్రతకు ప్రమాదమైన, ఐటీ చట్టాలను ఉల్లంఘించే అభ్యతరకర పోస్టులు ఎట్టొద్దని మీ గ్రూపు సభ్యులకు చెప్పుకోవాలి.
♦ ఎవరైనా సభ్యులు పరిధి దాటి ప్రవర్తిస్తే ఆ విషయాన్ని ముందుగానే పోలీసులకు చెప్పాలి. లేదంటే అడ్మిన్ చేతికి బేడీలు తప్పవు.
♦ గ్రూపు లో మీ ప్రమేయం, ఇష్టం లేకుండా ఒక అడ్మిన్ మిమ్మల్ని కూడా అడ్మినిస్ట్రేటర్‌గా మారిస్తే ఆ గ్రూపు నుంచి బయట పడటం ఉత్తమం. లేదంటే చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
♦ మెసేజ్ తీవ్రతను బట్టి సభ్యులు కానివారు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
♦ పేరున్న రాజకీయ నాయకులు, ప్రముఖులను దూషించే విధంగా పోస్టు చేయరాదు.
♦ కాాపీరైట్ చట్టం కింద ఇంటర్నెట్, ఇతర ప్రసార మాద్యమాల్లో అంశాలను
♦ కాపీ చేసి వాటిని వాట్సప్‌లో పోస్టు చేయడం కూడా నేరమే.