వాట్సాప్ లింకులు ప్రమాదకరమే! | Alert! Clicking WhatsApp links exposes you to cyber theft | Sakshi
Sakshi News home page

వాట్సాప్ లింకులు ప్రమాదకరమే!

Published Sat, Nov 26 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

వాట్సాప్ లింకులు ప్రమాదకరమే!

వాట్సాప్ లింకులు ప్రమాదకరమే!

లండన్: వాట్సప్‌లో ప్రతిరోజూ వివిధ గ్రూపులలో వందలాది మెసేజిలు వస్తుంటారుు. కొంతమంది రకరకాల లింకులు పంపుతుంటారు. ఏవేవో ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడతారు. కానీ, అలా వచ్చిన లింకులన్నింటినీ ఓపెన్ చేసి చూశారో.. మీరు సైబర్ దాడుల బారిన పడటం ఖాయమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లందరినీ ఈ మేరకు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేసి, సులభంగా వారిని బుట్టలో పడేసేందుకు హ్యాకర్లు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. వాట్సప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఈమధ్య వచ్చింది.

వాస్తవానికి గూగుల్ ప్లేస్టోర్‌లో వాట్సప్‌ను అప్‌డేట్ చేసుకుంటే చాలు.. ఈ వీడియో కాల్స్ వచ్చేస్తున్నారుు. కానీ, చాలామంది దానికి సంబంధించి ఓ లింకును విపరీతంగా ఫార్వర్డ్ చేశారు. పొరపాటున అలాంటి లింకులను ఓపెన్ చేస్తే వెంటనే మన ఫోన్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫోన్లో భద్రపరిచిన వ్యక్తిగత డేటా మొత్తం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. గ్రూప్ వీడియో కాలింగ్ పేరుతో కూడా కొన్ని లింకులు వస్తున్నాయని, ఇవన్నీ చాలా ప్రమాదకరమని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement