శాన్‌ఫ్రాన్సిస్కోః ఫేస్‌బుక్ సొంతమైన ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సౌలభ్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్‌లకు ఊరట కల్పించేలా సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది. . డిలిట్ ఫర్ ఎవ్రీ వన్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌తో అప్ డేట్ చేస్తోంది. అతి త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం వాట్సాప్ లో పోస్ట్ అయిన మెసేజ్‌ను అడ్మిన్ ఎంచుకున్న గ్రూపు సభ్యుల్లో ఇతరులు డిలిట్ చేసే అవకాశాన్నికల్పిస్తోంది.
వాబేటా ఇన్ఫో. కాం అందించిన సమాచారం ప్రకారం గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం వెర్షన్ 2.17.387 లో వాట్సాప్ సమర్పించింది. గ్రూప్ మేనేజ్‌మెంట్ కోసం, గ్రూప్ అడ్మిన్ రక్షించే ప్రయత్నంలో గ్రూప్ డీపీని మార్చడం సహా ఇతర విషయాలను ఎడిట్ చేసే సభ్యులను ఎంచుకునే అవకాశాన్నివ్వనుంది. దీని ద్వారా గ్రూపులో ఏదైనా పోస్ట్‌ను, మెసేజ్‌ను ఇతర గ్రూప్ అడ్మిన్‌లు డిలిట్ చేసే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోందని నివేదించింది. ప్రస్తుతం పరీక్ష దశల్లో ఈ ఫీచర్ విజయవంతమైన అనంతరం యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు టెస్టింగ్ టీజర్‌ను ఒకటి విడుదల చేస్తుంది. అలాగే బ్యాంక్ టు బ్యాంక్ నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యూపిఐ సర్వీసును కూడా త్వరలోనే ప్రారంభించనుందట.
కాగా అన్‌సెండ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ద్వారా దీనిద్వారా అయిదు నిమిషాల్లో టెక్ట్స్ మెసేజ్, ఇమేజ్,జిఫ్ లతోపాటు స్టేటస్ రిప్లైని కూడా డిలిట్ చేయవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment