Administrators
-
అడ్మినిస్ట్రేషన్ స్కిల్ (పాలనా నైపుణ్యం) మీలో ఉందా?
అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారా? కంపెనీ లాభాల బాటలో నడవటానికి పరిపాలనా విభాగం సరిగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ స్కిల్ ఉన్నవారు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించటంతో పాటు, ఉద్యోగులందరిలో పాజిటివ్ ఆటిట్యూడ్‌ను కలిగిస్తారు. సమన్వయంతో ఉంటూ, ఉద్యోగస్తులందరిలో స్ఫూర్తిని నింపుతారు. ఆపదలో కంపెనీకి అండగా నిలుస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేక గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకుంటున్నారా? పరిపాలనా నైపుణ్యం మీలో ఎలా ఉందో తెలుసుకోండి. 1. మీ దగ్గరకొచ్చేవారి పేర్లను బాగా గుర్తుంచుకుంటారు. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. (సిగరెట్ తాగటం, చూయింగ్ గమ్ నమలటం, మాటలకు అడ్డురావటం లాంటివి చేయరు). ఎ. కాదు బి. అవును 2. సమయపాలనను అనుసరిస్తారు. ఇలానే ఉద్యోగులందరూ ఉండాలని సూచిస్తారు. ప్రొఫెషనల్‌గా డ్రెస్ చేసుకుంటారు. ఉద్యోగు లందరితో స్నేహభావంతో ఉంటారు. ఎ. కాదు బి. అవును 3. వృత్తిలో జాగరూకతతో ఉంటారు. ఎటువంటి తప్పులకు తావివ్వరు. పాలనా పరమైన అంశాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఎ. కాదు బి. అవును 4. వినయంగా ఉంటారు. ఆచితూచి మాట్లాడతారు. సమయస్ఫూర్తితో మెలుగుతారు. ఎ. కాదు బి. అవును 5. వ్యక్తిగత సమస్యలను ఆఫీసు దాకా తీసుకు రారు. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటారు. ఎ. కాదు బి. అవును 6. వృత్తిలో పారదర్శకత చూపిస్తారు. తోటివారి సలహాలు సూచనలు అవలంబిస్తారు. వారిని కించపరచరు. క్లిష్ట సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలరు. ఎ. కాదు బి. అవును 7. ప్రతిమాటని ఆలోచించి మాట్లాడతారు. మీపై గౌరవం పెరగటానికి ఇది చాలా ముఖ్యమని మీకు తెలుసు. ఇదేవిధంగా మీటింగ్‌లలో మాట్లాడతారు. ఎ. కాదు బి. అవును 8. ఓపిక, దయ, జాలి, క్షమల ద్వారా సహనాన్ని పొందుతారు. ఈ విధంగా అడ్మినిస్ట్రేష¯Œ ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎ. కాదు బి. అవును 9. పనిచేస్తున్న సంస్థ పట్ల చాలా విశ్వాసంగా, నిజాయితీగా ఉంటారు. అవిశ్వాసం మీ కెరియర్ని మెరుగుపరచదని మీరు గ్రహిస్తారు. ఎ. కాదు బి. అవును 10. వృత్తిని ఇష్టంగా చేస్తారు. చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. సెన్సాఫ్ హ్యూమర్ మీలో ఉంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలరు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే మీలో పాలనా నైపుణ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. మీలో ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల ఎక్కడకు వెళ్లినా పేరు తెచ్చుకుంటుంటారు. మేనేజ్మెంట్ దృష్టిలో గుర్తింపు పొందుతారు. సాటి ఉద్యోగుల దగ్గర మన్ననలు పొందుతారు. ఈ ఆటిట్యూడ్ మీ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి, ఆర్థికంగా బలపరచటానికి కూడ ఉపయోగపడుతుంది. ‘ఎ’ లు ఆరు దాటితే మీకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేదనే చెప్పాలి. ఇతరులమీద ఆధార పడటమే కాని స్వతంత్రంగా వ్యవహరించటం మీకు తెలియదు. ‘బి’ లను సూచనలుగా భావించి పాలనా నైపుణ్యం ఎలా పొందవచ్చో తెలుసుకోండి. -
బోర్డు ఆఫీస్ బేరర్ల అధికారాలకు కత్తెర
న్యూఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) మధ్య మరో వివాదం. మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ ఆధ్వర్యంలోని సీఓఏ... బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరిల నిర్ణయాధికారాలపై కత్తెర వేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు గత వారం సమర్పించిన ఏడో స్థాయీ నివేదికలో వీరి గురించి ప్రస్తావించని సీఓఏ... తాజాగా జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయమై కేసుల్లో న్యాయ సాయం పొందేందుకు బోర్డు అధికారులు ఇకపై బీసీసీఐ నిధులను వినియోగించుకోకుండా కూడా ఆదేశాలిచ్చింది. అధికారులు ప్రయాణ, నివాస భత్యాలకు సైతం తమ అనుమతి కోరాలని స్పష్టం చేసింది. నెలలో 25 రోజుల పాటు విమాన ప్రయాణాల్లో ఉంటూ స్టార్ హోటళ్లలో బస చేసే అమితాబ్ చౌదరిపైనే ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపనుంది. ‘అన్ని కాంట్రాక్టులు, నియామకాలపై బీసీసీఐ తరఫున బోర్డు తాత్కాలిక కార్యదర్శి సంతకం చేయొచ్చు. అయితే... సీఓఏ అంగీకరించిన వీటిపై నిర్ణీత గడువు ఐదు రోజుల్లోగా కార్యదర్శి స్పందించకుంటే సీఈవో ఆమోదంతో ముందుకెళ్తాం. ఆ నిర్ణయాలే అమలవుతాయి. ఉద్యోగులు, లబ్ధిదారులు, సర్వీస్ ప్రొవైడర్ల విషయంలో పరిపాలకుల కమిటీకి సంబంధించిన చర్చలు, సమాచారం తదితరాలన్నీ గోప్యంగా ఉంచాలి. వెల్లడించాల్సి వచ్చినా లిఖితపూర్వక అనుమతి పొందాలి’ అని సీఓఏ తమ ఆదేశాల్లో పేర్కొంది. వీటిపై బీసీసీఐ అధికారి ఒకరు తీవ్రంగా మండిపడ్డారు. ‘పాలనా వ్యవహారాలకు సంబంధించిన నియమాలను సీఓఏ పక్కకుపెట్టాలని చూస్తోంది. అందుకే బీసీసీఐ అధికారాలను లాగేసుకుంది. ఇటీవల క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టుల ఖరారు సందర్భంగా కూడా మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజలు గుడ్డిగా సంతకాలు పెట్టి అనుసరించాలని భావిస్తోంది. నిర్ణయాలు తీసుకునే ముందు అనుమతి కోరాలని షరతు విధించడం జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో మరొకరిని నియమించాలన్న సీకే ఖన్నా ఆలోచనను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది’ అని ఆ అధికారి మండిపడ్డారు. -
గ్రూప్ అడ్మిన్లకు రిలీఫ్.. వాట్సాప్ కొత్త ఫీచర్
శాన్‌ఫ్రాన్సిస్కోః ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సౌలభ్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్లకు ఊరట కల్పించేలా సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది. . డిలిట్ ఫర్ ఎవ్రీ వన్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌తో అప్ డేట్ చేస్తోంది. అతి త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం వాట్సాప్ లో పోస్ట్ అయిన మెసేజ్‌ను అడ్మిన్ ఎంచుకున్న గ్రూపు సభ్యుల్లో ఇతరులు డిలిట్ చేసే అవకాశాన్నికల్పిస్తోంది. వాబేటా ఇన్ఫో. కాం అందించిన సమాచారం ప్రకారం గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం వెర్షన్ 2.17.387 లో వాట్సాప్ సమర్పించింది. గ్రూప్ మేనేజ్మెంట్ కోసం, గ్రూప్ అడ్మిన్ రక్షించే ప్రయత్నంలో గ్రూప్ డీపీని మార్చడం సహా ఇతర విషయాలను ఎడిట్ చేసే సభ్యులను ఎంచుకునే అవకాశాన్నివ్వనుంది. దీని ద్వారా గ్రూపులో ఏదైనా పోస్ట్‌ను, మెసేజ్‌ను ఇతర గ్రూప్ అడ్మిన్లు డిలిట్ చేసే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోందని నివేదించింది. ప్రస్తుతం పరీక్ష దశల్లో ఈ ఫీచర్ విజయవంతమైన అనంతరం యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు టెస్టింగ్ టీజర్‌ను ఒకటి విడుదల చేస్తుంది. అలాగే బ్యాంక్ టు బ్యాంక్ నగదు ట్రాన్స్ఫర్ చేసుకునేలా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపిఐ సర్వీసును కూడా త్వరలోనే ప్రారంభించనుందట. కాగా అన్‌సెండ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ద్వారా దీనిద్వారా అయిదు నిమిషాల్లో టెక్ట్స్ మెసేజ్, ఇమేజ్,జిఫ్ లతోపాటు స్టేటస్ రిప్లైని కూడా డిలిట్ చేయవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఐపీఎల్ నిర్వహణకు అడ్మినిస్ట్రేటర్లు
ఇద్దరిని నియమించిన హైకోర్టు హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2017) మ్యాచ్‌లను అడ్మినిస్ట్రేటర్స్ పర్యవేక్షణలోనే నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఆదేశించింది. బీసీసీఐ సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలను అడ్మినిస్ట్రేటర్స్‌గా నియమించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సంఘాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలంటూ బీసీసీఐ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. హెచ్‌సీఏలో లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడం కూడా అడ్మినిస్ట్రేటర్స్ నియమించడానికి కారణమని తెలిపింది. ‘‘హెచ్‌సీఏలో సరఫరాదారులు, సిబ్బందికి బకాయిలు చెల్లింపు బాధ్యత అడ్మినిస్ట్రేటర్స్దే. వాస్తవాలను పరిశీలించిన తర్వాతే బ్యాంకులో ఉన్న నగదు నిల్వల ఆధారంగా చెల్లింపులు చేయాలి. అవసరమనుకుంటే ఉత్తర్వుల సవరణకు తమను ఆశ్రయించవచ్చు. అడ్మినిస్ట్రేటర్స్ రవాణా ఖర్చులను హెచ్‌సీఏ చెల్లించాలి. ఇద్దరు అడ్మినిస్ట్రేటర్స్ బీసీసీఐని సంప్రదించి ఆర్థిక సలహాదారులను నియమించుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌ల ఖాతాల నిర్వహణ బాధ్యత ఆర్థిక సలహాదారులే చూడాలి. హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్‌లు చూసేందుకు అవకాశం కల్పించండి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మా పొట్ట కొట్టారు!
- మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల ఆవేదన - కలెక్టర్‌కు విన్నవించుకున్నా ఫలితం శూన్యం సాంబమూర్తినగర్ (కాకినాడ) : సుమారు 15 ఏళ్లుగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించిన తమను నట్టేట ముంచారంటూ పథక నిర్వాహకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు గురువారం కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 2002లో అప్పటి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించే బాధ్యతను తమకు అప్పగించిందన్నారు. బిల్లులు సక్రమంగా రాకపోయినా ఎన్నో కష్టనష్టాలు పడి విద్యార్థులకు భోజనం అందించామన్నారు. అయితే అక్షయ పాత్ర పేరుతో తమ పొట్టకొట్టే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం ఉందని ఆరోపించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్షయ పాత్ర వారే విద్యార్థులకు భోజనం అందిస్తారని, తమను విరమించుకోవాలని సూచించారని వాపోయారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబును ఆశ్రయించగా ఆయన తమను నాలుగు రోజులు తన ఇంటి చుట్టూ తిప్పించుకుని తానేమీ చేయలేనని, కలెక్టర్‌ను కలవాల్సిందిగా సూచించారన్నారు. కాకినాడ నగరంలో సుమారు 200 మంది నిర్వాహకులు, కార్మికులు మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరంతా రోడ్డున పడే ప్రమాదముందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విషయాన్ని కలెక్టర్ అరుణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
మింగేస్తున్న మట్కా...
- జిల్లాలో మట్కా జూదానికి బానిసలై బలైపోతున్న సామాన్యులు - లక్షాధికారులవుతున్న నిర్వాహకులు - పక్కా సమాచారమున్నా.. పట్టించుకోని పోలీసులు గిద్దలూరు : జిల్లాలో మట్కా జూదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం జిల్లావ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన ఈ జూదం.. తాజాగా మళ్లీ సామాన్యులను మింగేస్తోంది. పశ్చిమ ప్రకాశంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాలకు విస్తరించి పేదల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీనికి బానిసలై ఎంతోమంది సర్వం కోల్పోయి బికారులవుతుండగా నిర్వాహకులు మాత్రం లక్షాధికారులవుతున్నారు. నిర్వాహకులపై పోలీసులకు పక్కా సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్కా జూదమంటే... ముంబై కేంద్రంగా నడిచే చట్ట విరుద్ధమైన జూదం పేరే మట్కా. ఈ జూదం ఆడేందుకు ఆన్లైన్ వెబ్సైట్లో లాగిన్ అవడంతో పాటు స్థానికంగా నిర్వాహకులను సంప్రదిస్తుంటారు. జూదం ఆడేవారు 10 నుంచి 99 వరకూ ఏదోక నంబర్‌ను ఎంపిక చేసుకుంటారు. దానిపై రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందెం కడతారు. రాత్రి సమయంలో ముంబై కేంద్రం నుంచి విడుదల చేసే గేమ్నంబర్.. ఆడేవారు ముందుగానే ఎంపిక చేసిన నంబర్ ఒకటే అయితే రూపాయికి 70 రూపాయల చొప్పున నిర్వాహకులు చెల్లిస్తారు. కనీసం మొదటి అంకె సరిపోలినా రూపాయికి 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. లేకుంటే పందెం కాసిన నగదు పోయినట్టే. ఇలా ప్రతిరోజూ ఒక నంబర్‌పై పందెం కాస్తుంటారు. దానికి సంబంధించి అసలు నంబర్లో మొదటి అంకెను ముంబై నుంచి రాత్రి 11 గంటల సమయంలో, రెండో అంకెను 12 గంటల తర్వాత విడుదల చేస్తారు. రోజుకు రూ.25 లక్షల వరకూ పందేలు... పూర్తిగా చట్టవ్యతిరేకమైన ఈ జూదానికి జిల్లాలోని ఎంతోమంది బానిసలు కావడంతో రోజుకు 25 లక్షల రూపాయల వరకూ జిల్లాలో పందేలు నడుస్తున్నాయి. రోజుకు ఈస్థాయిలో జిల్లావాసులు నష్టపోతుండగా నిర్వాహకులు మాత్రం లక్షల రూపాయలకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో పాటు పోలీసుల సహకారంతోనే నిర్వాహకులు ఈ జూదాన్ని క్రమంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులను కొందరు అవినీతి పోలీస్ అధికారులు ప్రోత్సహిస్తున్నారన్న విషయం జిల్లాలో బహిరంగ రహస్యంగా మారింది. దీనివల్లే గతంలో రోజుకు 10 లక్షల రూపాయల వరకూ సాగే మట్కా జూదం..ప్రస్తుతం 25 లక్షల రూపాయల వరకూ పెరిగినట్లు సమాచారం. పశ్చిమానే రూ.10 లక్షల్లో పందేలు... జిల్లాలో మట్కా జూదానికి సంబంధించి రోజుకు 25 లక్షల రూపాయల పందేలు జరుగుతుండగా, ఒక్క పశ్చిమ ప్రకాశంలోనే 10 లక్షల రూపాయల వరకూ పందేలు కాస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గంలో సగానికిపైగా గ్రామాల్లో మట్కా జూదం నిరాటంకంగా సాగుతోంది. గిద్దలూరు పట్టణంలోని పాములపల్లె రోడ్డు, కుమ్మరామంకట్ట, గాంధీ బొమ్మ సెంటర్, రాచర్ల రోడ్డు, కొంగళవీడురోడ్డు, ముండ్లపాడు, కేఎస్ పల్లె, కొత్తపల్లె, రాచర్ల మండలంలోని గుడిమెట్ట, రామాపురం, సోమిదేవిపల్లె, యడవల్లి, కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె, తాటిచర్లమోటు, కంభం ఇలా అన్ని గ్రామాల్లో మట్కా జూదం నిర్వాహకులున్నారు. రోజువారీ కూలి కోసం పనిచేసే కూలీల నుంచి ఆటోడ్రైవర్లు, ఇతర వ్యాపారస్తులు, సంపన్నులు సైతం ఎవరిస్థాయికి తగ్గుట్టు వారిస్థాయిలో రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందేలు కాస్తుంటారు. కళాశాల విద్యార్థులు సైతం ఈ జూదానికి బానిసలవుతున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ జూదానికి మరింత మంది బలైపోకముందే పోలీసులు మేల్కొని నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.