తాటిచెట్లపాలెం (విశాఖ) : పూరీ జగన్నాథ రథయాత్రకు వాల్తేరు డివిజన్ నుంచి ప్రత్యేక రైళ్లు కూత వేయనున్నాయి. ఇందులో భాగంగా 10 రైళ్లను విశాఖ నుం చి నడపనున్నట్టు సీనియర్ డివిజినల్ కమర్షియ ల్ మేనేజర్ ఎల్వేందర్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
రైళ్ల వివరాలివి..
విశాఖ-పూరీ- విశాఖ ప్రత్యేక రైలు(08907/08908)
విశాఖ నుంచి 08907 నంబర్‌తో రైలు ఈ నెల 5న మధ్యాహ్నం 1.20 గంటకు బయలుదేరి ఆ మర్నాడు అర్ధరాత్రి 1.40 గంటలకు పూరీ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 08908 నంబరుతో పూరీ నుంచి ఈ నెల 7న అర్ధరాత్రి బయలుదేరి అదేరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 16 ద్వితీయ శ్రేణి తరగతి సిటింగ్ కమ్ రెండు లగేజీ భోగీలతో ఈ రైళ్లు నడవనున్నాయి.
జగదల్‌పూర్-పూరీ-జగదల్‌పూర్(08925/08926)
జగదల్‌పూర్‌లో 08925 నంబర్‌తో ప్రత్యేక రైలు ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 11.30 గంటలకు పూరీ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 08926 నంబరుతో పూరీ నుంచి ఈనెల 6న సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 12.45 గంటలకు జగదల్‌పూర్ చేరుకుంటుంది. రెండు థర్డ్ ఏసీ, ఆరు స్లీపర్ క్లాస్‌లు, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్‌ల సామర్థ్యంతో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
విశాఖ-పూరీ-విశాఖ(08907/08934)
విశాఖలో 08907 నంబర్‌తో రైలు ఈనెల 13 మధ్యాహ్నం 1.20 గంటకు బయలుదేరి, ఆ మర్నాడు అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు పూరీ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 08934 నంబరుతో పూరీ నుంచి ఈనెల 14 సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 16 జనరల్ సెకండ్ క్లాస్ సిటింగ్, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజ్ కోచ్‌లతో ఈ రైళ్లు రాకపోలకు సాగించనున్నాయి.
విశాఖ-పూరీ-విశాఖ(08941/08946)
విశాఖ నుంచి పూరి వెళ్లే ఈ ప్రత్యేకరైలు ఈ నెల 15 ఉదయం 6.30 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు పూరీ చేరుకోగా, తిరుగు ప్రయాణంలో పూరీ నుంచి ఈ నెల 15 రాత్రి 11.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 16 జనరల్ సెకండ్ క్లాస్ , రెండు సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజ్ కోచ్‌ల సామర్థ్యంతో ఈ రైళ్లు తిరుగుతాయి.
- విశాఖ మీదుగా పూరీ వెళ్లే ప్రత్యేక రైళ్లు
మర్రిపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, సిగడం, పెందూరు, దూసి, శ్రీకాకుళం రోడ్డు, ఊర్లం, తైలూరు, కోటబొమ్మాలి, నౌపడా, పలాస, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మపూర్, ఛత్రాపూర్, గంజాం, చిల్కా, బాలుగాన్, కుహురి, కల్పరా ఘాట్, భువనేశ్వర్, నిరంకార్‌పూర్, ఖుర్దారోడ్, మోటరీ, బిర్‌పురుషోత్తమ్‌పూర్, సఖిగోపాల్, మాలటిపట్‌పూర్ స్టేషన్ల మీదుగా ఈ రాకపోకలు సాగిస్తాయి.
పూరీ జగన్నాథ యాత్రకు ప్రత్యేక రైళ్లు
Published Sat, Jul 2 2016 3:01 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
Advertisement