శ్రీశ్రీ గీతాలతో ‘మహాఖడ్గం’
ఒక తరాన్ని ఉర్రూతలూగించిన మహాకవి శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి’ కవితా సంపుటాల్లోని గీతాలను నేటి యువతరానికి మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ‘మహాఖడ్గం’ ఆడియో సీడీని రూపొందించాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువగాయకులు గానం చేసిన గీతాలను ఈ సీడీలో పొందుపరిచాను’ అని విశ్రాంత బ్యాంక్ మేనేజర్ చెరుకుపల్లి గాంగేయశాస్త్రి చెప్పారు. మార్చి 10న కళాగౌతమి ఆధ్వర్యంలో సీడీ ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు
-
‘మహాప్రస్థానం, ఖడ్గసృష్టి’ల మేలుకలయికగా సీడీ
-
నేటితరం కోసమేనంటున్న రూపకర్త గాంగేయశాస్త్రి
రాజమహేంద్రవరం కల్చరల్ : ఒక తరాన్ని ఉర్రూతలూగించిన మహాకవి శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి’ కవితా సంపుటాల్లోని గీతాలను నేటి యువతరానికి మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ‘మహాఖడ్గం’ ఆడియో సీడీని రూపొందించాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువగాయకులు గానం చేసిన గీతాలను ఈ సీడీలో పొందుపరిచాను’ అని విశ్రాంత బ్యాంక్ మేనేజర్ చెరుకుపల్లి గాంగేయశాస్త్రి చెప్పారు. మార్చి 10న కళాగౌతమి ఆధ్వర్యంలో సీడీ ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీడీ రూపకల్పనలో తన లక్ష్యాలను బుధవారం ‘సాక్షి’కి ఇలా వివరించారు..
‘గోదావరి పుష్కరగీతాలతో ‘పుష్కర గోదావరి’ ఆడియో సీడీని ఉపాధ్యాయుడు చెరుకూరి నాగేశ్వరరావు సహకారంతో రూపొందించాను. తరువాత నండూరి సుబ్బారావు రచించిన ఎంకి పాటల సీడీని రూపొందించాను. ఈనాటి తరం శ్రీశ్రీ గీతాల మాధుర్యాన్ని తెలుసుకోవడానికి నేటి సంగీత ధోరణులతో ‘మహాఖడ్గం’ సీడీని రూపొందించాను. ‘మహాప్రస్థానం’లోని ‘పొలాలనన్నీ, హలాల దున్నీ’ గేయాన్ని సి.ఆర్.శ్రీకాంత్ గుక్క తిప్పుకోకుండా ఆలపించారు. అలాగే ‘వేళకాని వేళల్లో–లేనిపోని వాంఛలతో’ గీతాన్ని నేను స్వయంగా పాడాను. అలాగే ‘భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని’, ‘ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం నీవన్నది’ పాటలను రికార్డు చేశాం. ‘ఖడ్గసృష్టి’లోని ‘ఓ మహాత్మా! ఓ మహర్షీ!’, ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు’, ‘కదలవోయి ఆంధ్రకుమారా!’, ‘కూటికోసం–కూలికోసం’ గీతాలను రికార్డు చేశాను. 1930వ దశకం నుంచే శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలను రచించినా తొలి ముద్రణ మాత్రం 1950లో జరిగింది. నేటికీ శ్రీశ్రీ గీతాలు నిత్యనూతనాలని సీడీలోని పాటలు విన్నవారు అంగీకరిస్తారు. తఈ గీతాలను నాతోపాటు పి.వి.ఎల్.ఎ¯ŒS.మూర్తి, వాసంతి ఆలపించారు’ అని గాంగేయశాస్త్రి చెప్పారు.