హాకీలో ఎస్‌ఆర్‌కేఆర్ విద్యార్థుల ప్రతిభ
Published Tue, Dec 6 2016 1:43 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
భీమవరం : అంతర్ కళాశాలల హాకీ పోటీల్లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ చెప్పారు. సోమవారం కళాశాల వద్ద విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఎల్.బుల్లయ్య కళాశాలలో ఈనెల 2 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రా వర్సిటీ అంతర్ కళాశాల హకీ పోటీలు జరిగాయన్నారు. తమ కళాశాల హాకీ జట్టులోని జె.మహేష్‌కుమార్, ఏవీఎస్ పవ¯ŒS ఈనెల మూడో వారంలో చెన్నైలో నిర్వహించే సౌత్‌జో¯ŒS పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరితో పాటు ఎ¯ŒS.సాయికిరణ్‌ను బైస్టాండ్‌గా ఎంపిక చేశారన్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో విజయం సాధించిన హాకీ బృందాన్ని కళాశాల డైరెక్టర్ సాగి విఠల్ రంగరాజు, ప్రిన్సిపాల్ పార్థసారథివ ర్మ, పీడీ పి.సత్యనారాయణరాజు అభినందించారు.
Advertisement
Advertisement