srkr
-
ఎస్‌ఆర్‌కేఆర్‌లో మీడియా ఇంక్యుబేషన్ కేంద్రం
భీమవరం : భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సినీ నటుడు జగపతిబాబు, క్లిక్ సినీ క్రాఫ్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా రిలేటెడ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్టు సినీ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ తెలిపారు. శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శశిప్రీతమ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ కళలను వెలుగులోకి తెచ్చేందుకు క్లిక్ సినీ క్రాఫ్ట్ చేయూతనిస్తోందన్నారు. సినీనటుడు జగపతిబాబు రూపొందించిన పోర్టల్ ద్వారా విద్యార్థులకు అభిరుచి ఉన్న రంగాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు నిపుణులతో సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో కళానైపుణ్యానికి సాఫ్ట్వేర్ రంగం తోడైతే చిత్ర పరిశ్రమలో అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోవచ్చన్నారు. విశాఖ, విజయవాడ, కోనసీమ ప్రాంతాల్లో అందమైన లోకేషన్లు ఉన్నాయని, అక్కడ మరిన్ని సినిమాలు నిర్మించాలి్సన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కళాశాల స్థాయిలో విద్యార్థులకు షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తే విద్యార్థులు ప్రతిభను వెలికితీయడంతో పాటు సమాజంలోని సమస్యలను తెరకెక్కించే అవకాశం ఉంటుందన్నారు. వీటిని యూ ట్యూబ్‌లో పోస్ట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, మంచి డాక్యుమెంటరీలు కూడా రూపొందించవచ్చని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ తమ కళాశాలలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఉన్నాయని, వీటిని విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. వాసుదేవ మూర్తి, కాంతారావు, పీవీ రామరాజు, ప్రొఫెసర్ బీవీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు
భీమవరం : విద్యార్థులు సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని, శాటిలైట్స్ రూపకల్పన చేసి విజయాన్ని సాధించాలని జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగం హెడ్ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రావు సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ట్రాన్స్–2017 జాతీయస్థాయి విద్యార్థి సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ సాంకేతిక ప్రగతిని ప్రపంచానికి చాటడానికి ఇస్రో ఏకకాలంలో 104 శాటిలైట్లను ప్రయోగిస్తుందని, నూతనంగా ప్రయోగిస్తున్న ఉపగ్రహాల ద్వారా 60 సెంటీమీటర్ల రెజుల్యూషన్‌తో ఛాయా చిత్రాలు భూమికి అందిస్తుందన్నారు. ఆటోశాట్ టూ ఎస్ ఉపగ్రహం పట్టణాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రణాళికలను సిద్ద్ధం చేస్తుందన్నారు. రిసోర్సెస్ ఉపగ్రహం వ్యవసాయ సమాచారం అందిస్తుందని, క్షామపరిస్థితులు ఎదురైనప్పుడు నీటి వనరులు ఎక్కడెక్కడున్నాయనే సమాచారాన్ని అందిస్తుందని సీవీ రావు చెప్పారు. ఓషన్‌శాట్ ఉపగ్రహం వల్ల సముద్ర ఉపరితలంపై మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయవచ్చని, తుపాను, సునామీల సమయంలో వాటి గమనాన్ని సమాచారం అందిస్తుందన్నారు. అనంతరం ట్రాన్స్ సింపోజియం సావనీర్‌ను ఆవిష్కరించారు. కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ సాగి విఠల్‌రంగరాజు, సీవీ రావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు, ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ పి.రామరాజు, ప్రొఫెసర్ ఎన్.వెంకటేశ్వరరావు, వై.రామలక్ష్మణ్, కేఎన్వీ సురేష్‌వర్మ, కేఎన్వీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
హాకీలో ఎస్ఆర్కేఆర్ విద్యార్థుల ప్రతిభ
భీమవరం : అంతర్ కళాశాలల హాకీ పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ చెప్పారు. సోమవారం కళాశాల వద్ద విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఎల్.బుల్లయ్య కళాశాలలో ఈనెల 2 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రా వర్సిటీ అంతర్ కళాశాల హకీ పోటీలు జరిగాయన్నారు. తమ కళాశాల హాకీ జట్టులోని జె.మహేష్‌కుమార్, ఏవీఎస్ పవ¯ŒS ఈనెల మూడో వారంలో చెన్నైలో నిర్వహించే సౌత్జో¯ŒS పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరితో పాటు ఎ¯ŒS.సాయికిరణ్‌ను బైస్టాండ్గా ఎంపిక చేశారన్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో విజయం సాధించిన హాకీ బృందాన్ని కళాశాల డైరెక్టర్ సాగి విఠల్ రంగరాజు, ప్రిన్సిపాల్ పార్థసారథివ ర్మ, పీడీ పి.సత్యనారాయణరాజు అభినందించారు. -
ఎస్ఆర్కేఆర్’లో సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ
భీమవరం : నేటి తరం విద్యార్థులు సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందితే భావవ్యక్తీకరణ, భాషపై పట్టుసాధించి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదుగుతారని ప్రముఖ సాఫ్ట్‌స్కిల్స్ సంస్థ సింకరోసర్వ్కు చెందిన లీడ్ట్రైనర్ కేఎల్ శంకర్ చెప్పారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వవిద్యార్థుల సంఘం వారం రోజుల పాటు నిర్వహించే సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో సాఫ్ట్‌స్కిల్స్ కేవలం ఉద్యోగావకాశాల కోసమేనని, భావన కంటే తమను తాము తీర్చిదిద్దుకోవాలనే పట్టుదల ఉండాలన్నారు. పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జేవీ నర్సింహరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు విద్యనాటికే ఉద్యోగవకాశాన్ని చేపట్టాలనే పట్టుదలతో నిరంతరం కృషి చేయాలన్నారు. పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు జంపన నర్సింహరాజు, డాక్టర్ ఎం.గజపతిరాజు పాల్గొన్నారు.