ఎస్‌ఆర్‌కేఆర్‌’లో సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ | skills training in srkr | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌కేఆర్‌’లో సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ

Published Fri, Aug 19 2016 11:53 PM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM

నేటి తరం విద్యార్థులు సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందితే భావవ్యక్తీకరణ, భాషపై పట్టుసాధించి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదుగుతారని ప్రముఖ సాఫ్ట్‌స్కిల్స్‌ సంస్థ సింకరోసర్వ్‌కు చెందిన లీడ్‌ట్రైనర్‌ కేఎల్‌ శంకర్‌ చెప్పారు.

భీమవరం : నేటి తరం విద్యార్థులు సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందితే భావవ్యక్తీకరణ, భాషపై పట్టుసాధించి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదుగుతారని ప్రముఖ సాఫ్ట్‌స్కిల్స్‌ సంస్థ సింకరోసర్వ్‌కు చెందిన లీడ్‌ట్రైనర్‌ కేఎల్‌ శంకర్‌ చెప్పారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పూర్వవిద్యార్థుల సంఘం వారం రోజుల పాటు నిర్వహించే సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో సాఫ్ట్‌స్కిల్స్‌ కేవలం ఉద్యోగావకాశాల కోసమేనని, భావన కంటే తమను తాము తీర్చిదిద్దుకోవాలనే పట్టుదల ఉండాలన్నారు. పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ జేవీ నర్సింహరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు విద్యనాటికే ఉద్యోగవకాశాన్ని చేపట్టాలనే పట్టుదలతో నిరంతరం కృషి చేయాలన్నారు. పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు జంపన నర్సింహరాజు, డాక్టర్‌ ఎం.గజపతిరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement