టీఎన్‌ఐటీ జీఓ ప్రతులు దహనం
టీఎన్‌ఐటీ జీఓ ప్రతులు దహనం
Published Mon, Aug 15 2016 12:01 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ సామర్థ్యాల మదింపు పేరుతో ట్రై నింగ్ నీడ్ ఐడెంటిఫికేషన్ టెస్టు(టీఎన్‌ఐటీ) నిర్వహించడం ఉపాధ్యాయులను అవమానపరచడమేనని ఎస్‌ఎల్‌టీఏ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి అన్నారు. బోధనానుభవం కలిగిన వారికి సామర్థ్య పరీక్షల పేరుతో టెస్టు నిర్వహించడం సరికాదన్నారు. ఇది ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని శకించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఆదివారం కలెక్టరేట్ ఎదుట జీఓ ప్రతులను దహనం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యమాలు తప్పవన్నారు. సామర్థ్యాల మదింపు కోసం విడుదల చేసిన జీఓ 88ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్, గౌరవాధ్యక్షుడు బాలన్న, జిల్లా అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, హెచ్‌ఎంల సంఘం నాయకుడు శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంతా సుబ్బారాయుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement