ఎస్‌ఆర్‌కేఆర్‌లో మీడియా ఇంక్యుబేషన్ కేంద్రం
Published Sun, Mar 19 2017 12:42 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
భీమవరం : భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సినీ నటుడు జగపతిబాబు, క్లిక్ సినీ క్రాఫ్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా రిలేటెడ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్టు సినీ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ తెలిపారు. శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శశిప్రీతమ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ కళలను వెలుగులోకి తెచ్చేందుకు క్లిక్ సినీ క్రాఫ్ట్ చేయూతనిస్తోందన్నారు. సినీనటుడు జగపతిబాబు రూపొందించిన పోర్టల్ ద్వారా విద్యార్థులకు అభిరుచి ఉన్న రంగాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు నిపుణులతో సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో కళానైపుణ్యానికి సాఫ్ట్‌వేర్ రంగం తోడైతే చిత్ర పరిశ్రమలో అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోవచ్చన్నారు. విశాఖ, విజయవాడ, కోనసీమ ప్రాంతాల్లో అందమైన లోకేషన్లు ఉన్నాయని, అక్కడ మరిన్ని సినిమాలు నిర్మించాలి్సన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కళాశాల స్థాయిలో విద్యార్థులకు షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తే విద్యార్థులు ప్రతిభను వెలికితీయడంతో పాటు సమాజంలోని సమస్యలను తెరకెక్కించే అవకాశం ఉంటుందన్నారు. వీటిని యూ ట్యూబ్‌లో పోస్ట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, మంచి డాక్యుమెంటరీలు కూడా రూపొందించవచ్చని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ తమ కళాశాలలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఉన్నాయని, వీటిని విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. వాసుదేవ మూర్తి, కాంతారావు, పీవీ రామరాజు, ప్రొఫెసర్ బీవీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement