- రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
- సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
కమ్మ జాతి పటిష్టతకు కలిసికట్టు కృషి
Published Sun, Jul 24 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
న్యూశాయంపేట : కమ్మ జాతి పటిష్టత, కులస్తుల అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ గార్డెన్‌లో కమ్మసేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ మాస సకుటుంబ సమారోహ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మందడి కోటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
పౌరుషానికి మారుపేరైన కమ్మ కులస్తులు.. ఒంటరిగా ఉన్నప్పుడు గొప్పగా, అందరూ కలిస్తే బలహీనంగా ఉంటారని చమత్కరించారు. అందరూ కలిసి పనిచేస్తూ భవిష్యత్‌లో అన్ని సంఘాలకు మార్గదర్శకంగా పనిచేయాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎన్నోసార్లు ఎన్నికల్లో తనకు మనోధైర్యాన్ని ఇచ్చిన ఘనత కమ్మసంఘం వారేనని తెలిపారు. తన సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు సంఘం భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటగా, శరత్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. అలాగే, వివిధ రంగాల్లో సేవలందించిన వారిని సన్మానించిన మంత్రి కమ్మ సంఘం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బాలకోటేశ్వర్‌రావు, చేకూరి కాశయ్య, కార్పోరేటర్ మాడిశెట్టి అరుణ, కమ్మసంఘం నాయకులు శ్రీరామకృష్ణ ప్రసాద్, రాంబాబు, పోలయ్య, హరిబాబు, సుబ్రమణ్యం, గోపాల్, గరికపాటి హన్మంతరావు, త్రిపురనేని గోపీచంద్, భాస్కర్‌రావు, కృష్ణారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement