
కూసుమంచి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్‌కి సోమవారం ప్రమాదం తప్పింది. ఆయన ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కూసుమంచిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో మతిస్థిమితంలేని ఓ వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ మంత్రి కారును పక్కకు తీసుకెళ్లాడు.
మంత్రి కాన్వాయ్ స్పీడుగా వస్తుండటంతో హఠాత్ పరిణామంతో భద్రతా సిబ్బంది, స్థానికులు కంగుతిన్నారు. అనంతరం మంత్రి హైదరాబాద్ వెళ్లిపోగా.. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అన్నం ఫౌండేషన్‌కు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ రఘు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment