విద్యార్థిని పై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు | student harrassed by teacher | Sakshi
Sakshi News home page

విద్యార్థిని పై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

Published Sat, Aug 1 2015 10:13 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

student harrassed by teacher

కరీంనగర్ :కరీంనగర్ మండలం బావుపేటలోని ఓ ప్రై వేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి విద్యార్థిని ఇంటికి బైక్‌పై వచ్చిన ఉపాధ్యాయుడిని స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ అక్కడే విడిచిపెట్టి పారిపోయాడు.కాగా, శుక్రవారం గ్రామంలో పంచాయతీ నిర్వహించగా రాజకీయ ఒత్తిళ్లతో కొందరు గ్రామపెద్దలు ఉపాధ్యాయుడికి అండగా నిలిచారు. విషయం అందరికి తెలిస్తే పరువు పోతుందని, గొడవకు పోకుండా గుట్టుగా ఉండాలని విద్యార్థిని తల్లి, బంధువులకు పంచాయతీ పెద్దలు సూచించారు.
 

స్కూల్ కరస్పాండెంట్‌తో వ్యక్తిగత వివాదం ఉన్న కొందరు నాయకులు శనివారం విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి స్కూల్‌కు వెళ్లారు. ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలంటూ కరస్పాండెంట్‌తో వాగ్వాదానికి దిగారు. పాఠశాల బయట జరిగిన సంఘటనతో స్కూల్‌కు సంబంధం లేదని కరస్పాండెంట్ తిరుపతి చెప్పగా కొందరు వ్యక్తులు ఆగ్రహంతో అతడిపై దాడిచేసి కొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పాఠశాలకు వచ్చి తనను కొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కరస్పాండెంట్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై ఆమె తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయుడి భార్య కూడా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement