ప్రేమ వైఫల్యమే కారణం!
విజయనగరం క్రైం/చీపురుపల్లి రూరల్: పట్టణంలోని అయ్యన్నపేట జంక్షన్ సమీపంలో ఉంటున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చీపురుపల్లి మండలం పోతాయివలస గ్రామానికి చెందిన వాళ్లే అశోక్ (22) అయ్యన్నపేట సమీపంలోని ఓ ప్రైవేటు పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే జంక్షన్ సమీపంలో తన స్నేహితులతో కలిసి రూమ్‌లో అద్దెకు ఉంటున్నాడు.
తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అశోక్ తన స్నేహితులు శేఖర్, రాజు, శ్యామ్, శివరాం సెల్‌ఫోన్‌లకు శనివారం వేకువజామున 3.24 గంటలకు మెసేజ్ పెట్టాడు. శనివారం ఉదయం ఆరుగంటలకు స్నేహితులు లేచి సెల్‌ఫోన్ మెసేజ్‌లు చూశారు. వెంటనే పరిసర ప్రాంతాల్లో వెతికారు. రూమ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్‌టమెంటులో వైరుతో ఉరేసుకుని అశోక్ విగతజీవిగా కనిపించడంతో వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
ఎస్‌ఐ సీహెచ్.గోపాలకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలు పరిశీలించారు. ప్రేమ వైఫల్యమే మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు స్థానికులు ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
విద్యార్థి ఆత్మహత్య?
Published Sun, Apr 10 2016 12:09 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement