ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య | student suicide | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Aug 25 2016 9:32 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student suicide

మధుమేహం వ్యాధితో విరక్తి చెంది అఘాయిత్యం
అమలాపురం టౌన్‌ :
సరదాగా సాగి పోవాల్సిన వయసు నుంచే మధుమేహం వ్యాధి ఆ ఇంజనీరింగ్‌ విద్యార్థినికి ఇబ్బందిగా మారడంతో జీవితంపై విరక్తి చెంది చివరకు తన ప్రాణాలనే బలవంతంగా తీసుకున్న సంఘటన అమలాపురం వంటెద్దువారి వీధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తన 12 ఏళ్ల వయసు నుంచే తనకు వచ్చిన మధుమహం వ్యాధి ఇక తగ్గదన్న బాధతో ఆ వీధికి చెందిన ఎస్‌.తేజస్విని (20) అనే యువతి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ చెప్పిన వివరాల ప్రకారం... తేజస్విని భట్లపాలెం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ ఇంజనీరింగ్‌ చదువుతోంది. ఎనిమిదేళ్లుగా మధుమేహానికి ఆమె మందులు వాడుతూనే ఉంది. దీంతో ఆత్మనూన్యతా భావానికి గురైంది. బుధవారం రాత్రి తమ ఇంటి పక్కన బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతోంది. తమ ఇంట్లో వారంతా ఆ పెళ్లి  హడావుడిలో అక్కడే ఉన్నారు. ఈ సమయంలో తేజస్విని తన ఇంట్లో ఉరి వేసుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. తర్వాత అర్ధరాత్రి సమయంలో కుటుంబీకులు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. అందరితో చలాకీగా ఉండే తేజస్విని మధుమేహం ఇక తగ్గదన్న బెంగతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో గుర్తించారు. ఇక కొద్ది నెలల్లో ఇంజనీరింగ్‌ పట్టా అందుకోవాల్సిన తమ కూతురు ఇలా ఆత్యహత్య చేసుకోవడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో వంటెద్దవారి వీధిలో విషాదం అలుముకుంది. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement