విద్యార్థిని ఆత్మహత్య | student suicide | Sakshi

విద్యార్థిని ఆత్మహత్య

Feb 2 2017 12:12 AM | Updated on Nov 9 2018 5:02 PM

తల్లీదండ్రి గొడవ పడటంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది.

గుడిపాడు(గూడూరు రూరల్‌): తల్లీదండ్రి గొడవ పడటంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాలు.. మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన హరిజన రాజమ్మ, రోగెన్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమార్తె రాధ(15) గూడూరు హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. తాగుడుకు బానిసైన తండ్రి రోగెన్న నిత్యం భార్య రాజమ్మతో గొడవపడుతుండేవాడు. కంటి ముందు తల్లిదండ్రులు గొడవ పడుతుండటాన్ని చూసిన రాధ పలుమార్లు చెప్పినా తండ్రి వినిపించుకోకపోవడంతో తీవ్ర మనస్థానికి గురైంది. దీంతో తెల్లవారుజామున ఇంటిలో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఫ్యానుకు ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు గమనించి చూడగా అప్పటికే విగత జీవిగా మారింది. చేతికొచ్చిన కూతురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement