- ఎమ్మెల్యే దివాకర్‌రావు
- విద్యార్థులకు బ్యాగులు అందజేత
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
Published Thu, Jul 28 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
దండేపల్లి : మండలంలోని రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్రింగ్ ఏ స్మైల్ స్వచ్ఛంద సంస్థతో పాటు మరికొందరు ఎన్ ఆర్‌ఐలు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్యూల్‌బ్యాగులు, కంపాక్స్ బాక్సులు, ఆట వస్తువులు, క్రీడా సామగ్రిని విరాళంగా ఇచ్చారు. వీటిని ఎమ్మెల్యే దివాకర్‌రావు విద్యార్థులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛంద సంస్థల వారు బాసటగా నిలిచి వాటి అభివద్ధిలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కొట్టె రాజేశ్వరి సత్తయ్య, ఉప సర్పంచ్ బత్తుల శేఖర్, పాఠశాల హెచ్‌ఎం అర్చన, వివిధ గ్రామాల సర్పంచులు లింగాల తిరుపతి, మగ్గిడి శ్రీనివాస్, గూడెం ఎంపీటీసీ ముత్తెనారాయణ, నాయకులు సురేందర్, శంకర్‌రావు, అశోక్, రాకేశ్, సత్యగౌడ్, శ్రీనివాస్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement